Watch Video: అందుకే ప్రపంచ క్రికెట్‌కు దేవుడయ్యాడు.. ఆ రికార్డుతో సరికొత్త శకానికి నాంది పలికిన సచిన్..!

12 ఏళ్ల క్రితం ఇదే రోజున క్రికెట్ గాడ్ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 147 బంతుల్లో అజేయంగా 200 పరుగులు చేశాడు.

Watch Video: అందుకే ప్రపంచ క్రికెట్‌కు దేవుడయ్యాడు.. ఆ రికార్డుతో సరికొత్త శకానికి నాంది పలికిన సచిన్..!
Sachin Tendulkar First Double Century In Odi Format
Follow us
Venkata Chari

|

Updated on: Feb 24, 2022 | 4:40 PM

క్రికెట్‌(Cricketను మరింత ఆసక్తిగా మార్చేందుకు 1971 జనవరి 5న వన్డే క్రికెట్‌ను ప్రారంభించారు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే జరిగింది. ఇది జరిగిన 39 ఏళ్ల తర్వాత అంటే 2010లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ఎవరూ ఊహించని రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ ప్రపంచంలో దేవుడిగా పేరుగాంచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 24 ఫిబ్రవరి 2010న ODI క్రికెట్‌లో మొదటి డబుల్ సెంచరీ(Double Century)ని నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ 147 బంతుల్లో 200 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 25 ఫోర్లు, మూడు సిక్సర్లు వచ్చాయి.

భారత్ 401 పరుగులు చేసింది..

సచిన్ 200 పరుగులతో భారత్ 50 ఓవర్లలో మూడు వికెట్లకు 401 పరుగులు చేసింది. సచిన్‌తో పాటు దినేష్ కార్తీక్ 79, యూసుఫ్ పఠాన్ 36, కెప్టెన్ ఎంఎస్ ధోనీ 35 బంతుల్లో 68 పరుగులు చేశారు.

ధీటుగానే బదులిచ్చినా.. మధ్యలో తడబడిన సౌతాఫ్రికా..

భారత్ నిర్దేశించిన 402 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. అయితే, డివిలియర్స్ తన జట్టు తరఫున అజేయంగా 114 పరుగులు చేశాడు. అదే సమయంలో భారత్ తరఫున ఎస్ శ్రీశాంత్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు.

Also Read: Sachin Tendulkar: నా ఫొటోలను మార్ఫింగ్ చేసి వాడారు.. వారిపై కఠిన చర్యలకు సిద్ధం: సచిన్

ICC: ఐసీసీ కీలక నిర్ణయాలు.. అలాంటి పరిస్థితుల్లో 9 మందితోనే బరిలోకి.. ఎందుకో తెలుసా?