NZ vs AUS Highlights, T20 World Cup 2021 Final: ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం.. తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన ఫించ్ సేన
T20 World Cup 2021: కివీస్ ఇచ్చిన టార్గెట్‌ను 18.5వ ఓవర్‌లో కేవలం 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుంది. డేవిడ్ వార్నర్ 53, మిచెల్ మార్ష్ 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చారు.
NZ vs AUS Highlights, T20 World Cup 2021 Final: కీలకమైన ఫైనల్లో ఆస్ట్రేలియా టీం ఘన విజయం సాధించి తొలి టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పటి వరకు కలగానే మిగిలిన పొట్టి ఫార్మాట్ కప్‌ను న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి అందుకుంది. కివీస్ ఇచ్చిన టార్గెట్‌ను 18.5వ ఓవర్‌లో కేవలం 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుంది. డేవిడ్ వార్నర్ 53, మిచెల్ మార్ష్ 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చారు.
టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ప్రపంచకప్ విజేత ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. తుది పోరుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సిద్ధమయ్యాయి. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌పై దేశాలతో సంబంధం లేకుండా క్రికెట్ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు జట్లు గెలుపు కోసం ప్రణాళికలు రాచిస్తున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన కివీస్ ఈసారి టీ20 వరల్డ్ కప్ సాధించాలని పట్టుదలగా ఉంది. బౌలింగ్ విభాగంలో బలంగా ఉన్న న్యూజిలాండ్ ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది.
టిమ్ సోథి, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మైనేలతో బలంగా ఉంది. లెగ్ స్మిన్నర్ ఐష్ సోథి బాగానే రాణిస్తున్నాడు. ఐసీసీ టోర్నీల్లో మెరుగ్గా ఆడుతున్నా.. తుదిపోరులో ఒత్తిడిని అధిగమించలేక తడబడడం కివీస్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా కివీస్ ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ గెలవకపోవడంతో ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ఉంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్ సాధించిన చరిత్ర ఉన్నా.. టీ20 వరల్డ్ కప్ మాత్రం గెలుచుకోలేకపోయింది. దీంతో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆసీస్ భావిస్తోంది. మరి ఒకరిని మించి మరొకరు వ్యూహాలు రచించుకుంటోన్న రెండు జట్లలో ఎవరు విజయాన్ని సాధిస్తారో చూడాలి.
LIVE Cricket Score & Updates
-
కప్ ఆస్ట్రేలియాదే…
కీలకమైన ఫైనల్లో ఆస్ట్రేలియా టీం ఘన విజయం సాధించి తొలి టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పటి వరకు కలగానే మిగిలిన పొట్టి ఫార్మాట్ కప్‌ను న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి అందుకుంది. కివీస్ ఇచ్చిన టార్గెట్‌ను 18.5వ ఓవర్‌లో కేవలం 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుంది. డేవిడ్ వార్నర్ 53, మిచెల్ మార్ష్ 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చారు.
-
18 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు..
18 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా టీం 2 వికెట్లు కోల్పోయి 162 పరుగులు సాధించింది. క్రీజులో మార్ష్ 71, మ్యాక్స్‌వెల్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయం సాధించాలంటే 12 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
టీ20 ప్రపంచ కప్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్..
31 M మార్ష్ v NZ 2021 32 K విలియమ్సన్ v Aus 2021 33 K సంగక్కర v Ind 2014 33 J రూట్ v WI 2016 34 D వార్నర్ v NZ 2021
-
15 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు..
15 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా టీం 2 వికెట్లు కోల్పోయి 136 పరుగులు సాధించింది. క్రీజులో మార్ష్ 61, మ్యాక్స్‌వెల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయం సాధించాలంటే 30 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి ఉంది.
-
14 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు..
14 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా టీం 2 వికెట్లు కోల్పోయి 125 పరుగులు సాధించింది. క్రీజులో మార్ష్ 60, మ్యాక్స్‌వెల్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయం సాధించాలంటే 36 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మార్ష్
మిచెల్ మార్ష్ కేవలం 31 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో రెండో అర్థ సెంచరీ నమోదైంది.
-
వార్నర్ ఔట్..
అర్థ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ బౌల్డ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కీలకమైన ఫైనల్లో కేవలం 38 బంతుల్లో 53 పరుగుల నాక్ ఆడాడు. ఆసీస్ విజయం సాధించాలంటే 42 బంతుల్లో 64 పరుగులు చేయాల్సిఉంది.
-
అర్థ సెంచరీ చేసిన వార్నర్
ఫైనల్లో మరోసారి కీలక ఇన్నింగ్స్‌తో డేవిడ్ వార్నర్ ఆకట్టుకుంటున్నాడు. కేవలం 34 బంతుల్లో అర్థ సెంచరీ పూర్త చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
-
10 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు..
10 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా టీం 82 పరుగులు సాధించింది. క్రీజులో మార్ష్ 30, డేవిడ్ వార్నర్ 45 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయం సాధించాలంటే 60 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉంది.
-
ఆస్ట్రేలియాకు కీలక పాట్నర్‌షిప్..
న్యూజిలాండ్ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో వార్నర్, మార్ష్ కీలక భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వార్నర్ కేవలం 32 బంతుల్లో 44 పరుగులు సాధించారు. ఇక మార్ష్ విషయానికొస్తే 17 బంతుల్లో 29 పరుగులు సాధించాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడడంతో జట్టు స్కోరు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది.
-
ఆచితూచి ఆడుతోన్న ఆస్ట్రేలియా..
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆచితూచి ఆడుతున్నారు. ఒక వికెట్ కోల్పోయిన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ క్రమంలో 8 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులతో కొనసాగుతున్నారు. ప్రస్తుతం క్రీజులో వార్నర్ (26), మిచెల్ మార్ష్ (28) తో ఉన్నారు.
-
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..
న్యూజిలాండ్ ఇచ్చిన 173 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగి ఆస్ట్రేలియాకు ఆదిలోనే దెబ్బతగిలింది. బౌల్ట్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించిన ఫించ్ డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
-
ఆస్ట్రేలియా లక్ష్యం ఏంతంటే..
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడినప్పటికీ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మంచి ఆటతీరును కనబరిచారు. ఆస్ట్రేలియా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ మంచి లక్ష్యాన్ని ఇవ్వగలిగారు. నిర్ణీత 20 ఓవర్‌లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు సాధించింది.
-
వరుస వికెట్ల కోల్పోయిన న్యూజిలాండ్..
న్యూజిలాండ్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయాయి. జట్టు స్కోరును పెంచే క్రమంలో కేవలం 48 బంతుల్లో 85 పరుగులు చేసిన విలియమ్స్‌ను హాజెల్‌వుడ్ అవుట్ చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 160 పరుగుల వద్ద కొనసాగుతోంది.
-
రెండో వికెట్ గాన్..
ఆచితూచి ఆడుతున్నారు అనుకుంటోన్న సమయంలోనే న్యూజిలాండ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. జంపా వేసిన బంతికి షాట్‌కు ప్రయత్నించిన మార్టిన్ గప్టిల్ 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్కస్ స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
-
ఆచితూచి ఆడుతోన్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్..
టాస్ ఓడి బ్యాటింగ్‌లోకి దిగిన న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయిన తర్వాత ఆచితూచి ఆడుతోంది. ప్రస్తుతం పది ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 57 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో విలియమ్స్ (18), మార్టిన్ గప్టిల్ (27) పరుగులతో కొనసాగుతున్నారు.
-
తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..
న్యూజిలాండ్ జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో షాట్ ఆడడానికి ప్రయత్నించిన డారిల్ మిచెల్ మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 6.1 ఓవర్లకు న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయి 34 పరుగుల వద్ద కొనసాగుతోంది.
-
ప్లేయర్స్..
ఆస్ట్రేలియా:
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జాంపా, జోష్ హాజిల్‌వుడ్
న్యూజిలాండ్:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోది, ట్రెంట్ బోల్ట్
-
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి పై చేయి సాధించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ మొదట ఫీల్డింగ్ చేయాలని ఎంచుకున్నాడు. దుబాయ్ పిచ్‌ను గమనిస్తే టాస్ గెలిచిన వారే ఎక్కువగా గెలిచిన లెక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదట ఫీల్డింగ్ చేసిన వారికి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి అదే రిపీట్ అవుతుందా.? లేదా న్యూజిలాండ్ కొత్త చరిత్రను తిరగరాస్తుందా చూడాలి.
-
టాస్ గెలిచిన వారే గెలుస్తారా.?
టీ20 వరల్డ్ కప్ 2021లో టాస్ కీలక పాత్ర పోషిస్తోంది. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలవచ్చని చెబుతున్నారు. ఫైనల్లో కూడా టాస్ కీలకంగా ఉంటుందని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఎవరు గెలుస్తారన్నది టాస్‌ను బట్టి నిర్ణయించవచ్చని చెబుతున్నారు. ఇందుకు మూడు ఉదాహరణలు కూడా ఇస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2021 ఫైనల్ మ్యాచ్ ఈరోజు దుబాయ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇప్పుడు దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 10 సార్లు టాస్ గెలిచిన జట్టు విజేతగా నిలిచింది.11 సార్లు టాస్ గెలిచి జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మరి ఈసారి టాస్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూడాలి.
Published On - Nov 14,2021 6:58 PM