AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: ఇండియా జెండాకే వణుకుతున్న పాకిస్థాన్‌! మరీ ఇంత భయమైతే ఎలా రా..?

ఛాంపియన్స్‌ ట్రోఫీకి హోస్ట్‌ కంట్రీగా పాకిస్థాన్‌ వ్యవహరిస్తోంది. ఈ నెల 19 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే టోర్నీ ఆరంభానికి ముందే పాకిస్థాన్‌ ఓ వివాదాన్ని రాజేసింది. దీనిపై ఇప్పటికే సోషల్‌ మీడియా తగలబడి పోతోంది. ఇంతకీ పాకిస్థాన్‌ ఏం చేసింది. ఎందుకు భారత క్రికెట్‌ అభిమానులు పాక్‌ను తిట్టిపోస్తున్నారో ఇప్పుడు చూద్దాం..

Champions Trophy: ఇండియా జెండాకే వణుకుతున్న పాకిస్థాన్‌! మరీ ఇంత భయమైతే ఎలా రా..?
Gaddafi Stadium
SN Pasha
|

Updated on: Feb 17, 2025 | 10:57 AM

Share

ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 కోసం సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని జట్లు కూడా ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. టీమిండియా ఆటగాళ్లు కూడా దుబాయ్‌ వెళ్లి ఐసీసీ అకాడమీలో నెట్స్‌లో చెమట చిందిస్తున్నారు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. 20న టీమిండియ తమ తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడి, ఛాంపియన్స్‌ ట్రోఫీ వేటను మొదలుపెట్టనుంది. అయితే ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీకి పాకిస్థాన్‌ హోస్టింగ్‌ కంట్రీగా ఉన్న విషయం తెలిసిందే. హోస్టింగ్‌ కంట్రీగా ఉండటంతో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంపై ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొంటున్న దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. అందులో ఇండియన్‌ ప్లాగ్‌ మాత్రం పెట్టలేదు.

పాకిస్థాన్‌తో కలుపుకొని ఛాంపియన్స్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు ఈ మెగా టోర్నీలో భాగం అవుతున్నాయి. సో పెడితే అన్ని దేశాల జాతీయ జెండాలు పెట్టాలి. కానీ, పాకిస్థాన్‌ ఒక్కడే తన వక్ర బుద్ధిని చూపించింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంపై ఒక్క ఇండియా జెండా తప్పా, మిగిలిన అన్ని దేశాల జాతీయ జెండాలు ఏర్పాటు చేశారు. ఆదివారం గడాఫీ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా కొంతమంది భారత జాతీయ జెండా మిస్‌ అవుతుందని వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. కొంతమంది ఇండియాకు కౌంటర్‌ ఇచ్చేందుకే పాకిస్థాన్‌ కావాలనే ఇలా చేసిందని అంటున్నారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు ఇండియా తమ దేశానికి రాలేదనే కోపంతోనే భారత జాతీయ జెండాను గడాఫీ స్టేడియంపై పెట్టలేదని కొంతమంది అభిమానులు అంటున్నారు.

అయితే.. భారత జాతీయ జెండాను చూస్తే కూడా పాకిస్థాన్‌ భయపడుతుందని, అందుకే తమ జెండాను గడాఫీ స్టేడియంపై పెట్టలేదని భారత క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. కాగా భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ అంగీకరించలేదనే విషయం తెలిసిందే. 2009లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగడం లేదు. కానీ ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రం రెండు దేశాలు తలపడుతున్నాయి. అలాగే ఇండియాలో ఐసీసీ ఈవెంట్స్‌ జరిగితే మాత్రం పాకిస్థాన్‌ జట్టు ఇండియాకు వచ్చి ఆడుతుంది. 2023లో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా పాక్‌ ఇండియాలో మ్యాచ్‌లు ఆడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!