AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 2వ టెస్ట్‌లో చెత్త ఆటంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. లార్డ్స్ గడ్డపై గర్జించిన తెలుగోడు

Nitish Reddy Bowling Video: ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ నితీష్ రెడ్డికి చాలా దారుణంగా ఉంది. అతను బ్యాటింగ్‌తో కేవలం 2 పరుగులు మాత్రమే అందించగలిగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు, రెండవ ఇన్నింగ్స్‌లో ఒక పరుగు చేశాడు. బౌలింగ్ గురించి చెప్పాలంటే, ఎడ్జ్‌బాస్టన్‌లో అతనికి 6 ఓవర్లు మాత్రమే వచ్చాయి.

Video: 2వ టెస్ట్‌లో చెత్త ఆటంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. లార్డ్స్ గడ్డపై గర్జించిన తెలుగోడు
Nitish Reddy
Venkata Chari
|

Updated on: Jul 10, 2025 | 5:31 PM

Share

Nitish Reddy Bowling Video: లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో యువ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లను పడగొట్టి ఇంగ్లండ్ జట్టుకు గట్టి షాకిచ్చాడు. అయితే, ఇదే ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ ఒక క్యాచ్‌ను జారవిడిచి నితీష్ రెడ్డి ఖాతాలో మూడో వికెట్ వచ్చే అవకాశాన్ని దూరం చేశాడు. బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ వంటి బౌలర్లు విజయం సాధించని లార్డ్స్ పిచ్‌పై, నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించి, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్లు ఇద్దరినీ పెవిలియన్‌కు పంపాడు.

నితీష్ రెడ్డి బౌలింగ్ మ్యాజిక్..

లార్డ్స్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని ముందుగానే అంచనా వేసినప్పటికీ, నితీష్ రెడ్డి తన మొదటి ఓవర్‌లోనే అద్భుతం చేశాడు. తన వేగంతో, స్వింగ్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెడుతూ రెండు ముఖ్యమైన వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు వికెట్లు తీయడం ద్వారా నితీష్ రెడ్డి తన ఆల్ రౌండర్ సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పాడు. బౌలింగ్‌లో నిలకడగా రాణించలేకపోతున్నాడనే విమర్శలకు ఈ ప్రదర్శనతో కొంతమేర సమాధానం చెప్పాడు.

శుభ్‌మన్ గిల్ క్యాచ్ డ్రాప్..

నితీష్ రెడ్డి అద్భుతమైన బౌలింగ్‌తో మూడో వికెట్ దక్కే అవకాశం లభించినప్పటికీ, శుభ్‌మన్ గిల్ చేసిన క్యాచ్ డ్రాప్ కారణంగా అది సాధ్యపడలేదు. మూడో వికెట్ కోసం వేసిన బంతిని బ్యాట్స్‌మెన్ గాల్లోకి లేపగా, షార్ట్ కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ సులభమైన క్యాచ్‌ను జారవిడిచాడు. ఇది నితీష్ రెడ్డితో పాటు జట్టు సభ్యులను నిరాశపరిచింది. టెస్టు క్రికెట్‌లో ఇలాంటి కీలకమైన క్యాచ్‌లను జారవిడచడం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తన ఫీల్డింగ్‌లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన గుర్తుచేస్తుంది.

భారత జట్టుకు మిశ్రమ ప్రదర్శన..

నితీష్ రెడ్డి బౌలింగ్‌లో మెరిసినా, శుభ్‌మన్ గిల్ క్యాచ్ జారవిడచడం భారత జట్టుకు మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. ఈ టెస్టు సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. లార్డ్స్ టెస్టు సిరీస్ విజేతను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. నితీష్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లు ఇలాంటి మెరుపులు మెరిపించడం భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకం. అయితే, ఫీల్డింగ్‌లో మరిన్ని మెరుగుదలలు అవసరమని ఈ సంఘటన స్పష్టం చేసింది.

గత మ్యాచ్‌లో నితీష్ రెడ్డి విఫలం..

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ నితీష్ రెడ్డికి చాలా దారుణంగా ఉంది. అతను బ్యాటింగ్‌తో కేవలం 2 పరుగులు మాత్రమే అందించగలిగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు, రెండవ ఇన్నింగ్స్‌లో ఒక పరుగు చేశాడు. బౌలింగ్ గురించి చెప్పాలంటే, ఎడ్జ్‌బాస్టన్‌లో అతనికి 6 ఓవర్లు మాత్రమే వచ్చాయి. రెండవ ఇన్నింగ్స్‌లో అతనికి బంతి కూడా ఇవ్వలేదు. కానీ, లార్డ్స్‌లో టీమ్ ఇండియా వ్యూహాన్ని మార్చింది. నితీష్ రెడ్డికి 13 ఓవర్ల పాత బంతిని మాత్రమే ఇచ్చింది. అతను తన స్వింగ్‌తో ఇంగ్లాండ్‌కు రెండు భారీ షాక్ లు ఇచ్చాడు.

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...