AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NZ vs PAK, T20 Semi Final 1 Highlights: కివీస్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరిన పాక్.. మరోసారి కేన్ మామకు నిరాశే..

New Zealand vs Pakistan, T20 World Cup 2022 Highlights: కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ జట్టు ముందు 153 పరుగుల టార్గెట్ ఉంది.

NZ vs PAK, T20 Semi Final 1 Highlights: కివీస్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరిన పాక్.. మరోసారి కేన్ మామకు నిరాశే..
Nz Vs Pak Semifinal Live
Venkata Chari
|

Updated on: Nov 09, 2022 | 5:02 PM

Share

PAK vs NZ T20 World Cup 2022 Live Score: టీ20 ప్రపంచ కప్ 2022 లో  ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా పాకిస్థాన్‌ నిలిచింది. బుధవారం సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన సెమీఫైనల్లో 153 పరుగుల లక్ష్యాన్ని చేధించిన పాకిస్థాన్.. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 13 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఫైనల్‌కు చేరుకుంది. 2007లో ఆడిన తొలి టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరినా విజయం సాధించలేకపోయింది. చివరిసారిగా 2009లో ఆడిన టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

ఇరుజట్లు:

పాకిస్థాన్ ప్లేయింగ్ XI: మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 09 Nov 2022 05:01 PM (IST)

    NZ vs PAK: ఫైనల్ చేరిన పాకిస్తాన్.. కివీస్ ఘోర పరాజయం..

    టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా పాకిస్థాన్‌ నిలిచింది. బుధవారం సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన సెమీఫైనల్లో 153 పరుగుల లక్ష్యాన్ని చేధించిన పాకిస్థాన్.. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 13 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఫైనల్‌కు చేరుకుంది. 2007లో ఆడిన తొలి టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరినా విజయం సాధించలేకపోయింది. చివరిసారిగా 2009లో ఆడిన టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

  • 09 Nov 2022 04:12 PM (IST)

    NZ vs PAK: 10 ఓవర్లు ముగిసే సరికి..

    10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ టీం వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. బాబర్ 43, రిజ్వాన్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 09 Nov 2022 03:53 PM (IST)

    NZ vs PAK: 6 ఓవర్లు ముగిసే సరికి..

    6 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ టీం వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. బాబర్ 25, రిజ్వాన్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో పాక్ ఓపెనర్ల మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతోపాటు, పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ నమోదైంది.

  • 09 Nov 2022 03:39 PM (IST)

    NZ vs PAK: 3 ఓవర్లు ముగిసే సరికి..

    3 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ టీం వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. బాబర్ 7, రిజ్వాన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 09 Nov 2022 03:16 PM (IST)

    NZ vs PAK: పాకిస్తాన్ టార్గెట్ 153

    టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌-పాకిస్థాన్‌ మధ్య తొలి సెమీఫైనల్‌ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ జట్టు ముందు 153 పరుగుల టార్గెట్ ఉంది.

  • 09 Nov 2022 03:08 PM (IST)

    NZ vs PAK: 18 ఓవర్లు ముగిసే సరికి..

    18 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. మిచెల్ 46, జేమ్స్ నిషమ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 09 Nov 2022 02:44 PM (IST)

    NZ vs PAK: 14 ఓవర్లు ముగిసే సరికి..

    14 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 3 వికెట్లు కోల్పోయి 99పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 37, మిచెల్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 09 Nov 2022 02:28 PM (IST)

    నత్త నడకన కివీస్ బ్యాటింగ్..

    వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు.  కెప్టెన్ విలియమ్సన్ (24), డెరిల్ మిచెల్ (13) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 11 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 73/3.

  • 09 Nov 2022 02:16 PM (IST)

    కివీస్ కు మరో షాక్.. పెవిలియన్ చేరిన ఫిలిప్స్

    కివీస్ కు మరో షాక్ తగిలింది. 49 పరుగుల వద్ద ఆ జట్టు ఇన్ ఫాం బ్యాటర్ ఫిలిప్స్ (6) ఔటయ్యాడు.  నవాజ్ కు ఈ వికెట్ దక్కింది.  8 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 49/3

  • 09 Nov 2022 02:12 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన కివీస్..

    న్యూజిలాండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఆ జట్టు వన్ డౌన్ బ్యాటర్ డేవిడ్ కాన్వే (21) రనౌట్ అయ్యాడు. 7.2 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు 45/2.

  • 09 Nov 2022 01:51 PM (IST)

    NZ vs PAK: మూడు ఓవర్లు ముగిసే సరికి..

    మూడు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం ఒక వికెట్ కోల్పోయి 19 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 5, డేవాన్ కాన్వే 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 09 Nov 2022 01:38 PM (IST)

    NZ vs PAK: తొలి వికెట్ డౌన్..

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ టీంకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలోలేని షాహీన్ అఫ్రిది మొదటి ఓవర్‌లోనే కివీస్‌కు భారీ షాక్ ఇచ్చాడు. దీంతో మూడో బంతికే కివీస్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. ఫిన్ అలెన్(4) ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

  • 09 Nov 2022 01:09 PM (IST)

    న్యూజిలాండ్ ప్లేయింగ్ XI:

    ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

  • 09 Nov 2022 01:08 PM (IST)

    పాకిస్థాన్ ప్లేయింగ్ XI:

    మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది

  • 09 Nov 2022 01:06 PM (IST)

    NZ vs PAK: టాస్ గెలిచిన న్యూజిలాండ్..

    తొలి సెమీస్‌లో తలపడేందుకు న్యూజిలాండ్, కివీస్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీం. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ జట్టు బౌలింగ్ చేయనుంది.

  • 09 Nov 2022 12:57 PM (IST)

    NZ vs PAK: సిడ్నీలో టాస్ గెలిస్తే..

    ఇక్కడ జరిగిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట్లో ఫలితాలు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే అనుకూలంగా వచ్చాయి. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్ చేసినా.. భారీ స్కోర్ చేస్తే విజయం వరించే అవకాశం ఉంది.

  • 09 Nov 2022 12:47 PM (IST)

    NZ vs PAK: ప్రపంచ కప్ సెమీస్‌లో కివీస్‌పై పాకిస్తాన్‌దే పైచేయి..

    గతంలో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడినప్పుడల్లా విజయం సాధించిన చరిత్ర పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉంది. 1992, 1999 ODI ప్రపంచ కప్‌, 2007 టీ20 ప్రపంచ కప్‌ల సెమీ-ఫైనల్స్‌లో పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించింది.

  • 09 Nov 2022 12:45 PM (IST)

    NZ vs PAK: చరిత్రలో ఇరుజట్ల రికార్డులు..

    1992 ODI ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ సెమీ-ఫైనల్‌కు చేరుకోలేకపోయినందున ఈ మ్యాచ్‌తో చరిత్రను పునరావృతం చేసినట్లు కనిపిస్తోంది. అక్కడ వారు న్యూజిలాండ్‌ను ఓడించి చివరకు టైటిల్‌ను గెలుచుకున్నారు. పాకిస్థాన్ అభిమానులు మరోసారి అదే ఆశతో ఎదురుచూస్తున్నారు.

  • 09 Nov 2022 12:42 PM (IST)

    NZ vs PAK: ఫైనల్ టికెట్ ఎవరిదో..

    టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా అవతరిస్తుంది. గ్రూప్ 1లో న్యూజిలాండ్ జట్టు మొదటి స్థానంలో నిలవగా, గ్రూప్ 2లో పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది.

Published On - Nov 09,2022 12:40 PM

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ