కివీస్ ఖాతాలో చెత్త రికార్డు!
మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. అయితే భారత్ బౌలర్ల ధాటికి కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ తప్ప మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు అందరూ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ఇకపోతే న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 46.1 ఓవర్లకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ సమయానికి కివీస్ 211/5 పరుగులు చేసింది. ఇది […]
మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. అయితే భారత్ బౌలర్ల ధాటికి కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ తప్ప మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు అందరూ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ఇకపోతే న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 46.1 ఓవర్లకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ సమయానికి కివీస్ 211/5 పరుగులు చేసింది.
ఇది ఇలా ఉండగా ఈ గేమ్‌లో న్యూజిలాండ్ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మొదటి పవర్ ప్లే(10ఓవర్లలో) అత్యల్ప స్కోర్(27) చేసిన జట్టుగా కివీస్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. గతంలో ఇంగ్లాండ్ పై భారత్ చేసిన 28 పరుగుల అత్యల్ప స్కోర్‌ను సవరించి న్యూజిలాండ్ ఈ చెత్త గణాంకాలను నమోదు చేసింది.