వరుణుడి రాక.. మ్యాచ్ నిలిపివేత!

మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ బౌలర్ల ధాటికి కివీస్ కుదేలయ్యింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(67), రాస్ టేలర్(67*) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ 46.1 ఓవర్లకు చేరుకునే సరికి.. అనుకోని అతిథిలా వరుణుడు రావడంతో మ్యాచ్ నిలిపివేశారు. కాగా ప్రస్తుతం కివీస్ 46.1 ఓవర్లకు 211/5 పరుగులు చేసింది. అటు భారత్ బౌలర్లలో జడేజా, […]

వరుణుడి రాక.. మ్యాచ్ నిలిపివేత!
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 5:19 PM

మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ బౌలర్ల ధాటికి కివీస్ కుదేలయ్యింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(67), రాస్ టేలర్(67*) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ 46.1 ఓవర్లకు చేరుకునే సరికి.. అనుకోని అతిథిలా వరుణుడు రావడంతో మ్యాచ్ నిలిపివేశారు. కాగా ప్రస్తుతం కివీస్ 46.1 ఓవర్లకు 211/5 పరుగులు చేసింది. అటు భారత్ బౌలర్లలో జడేజా, బుమ్రా, పాండ్యా, భువనేశ్వర్, చాహల్‌లు చెరో వికెట్ పడగొట్టారు. ఇకపోతే వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది.