NED vs AFG Playing XI: సెమీస్ రేసులో ఆఫ్ఘానిస్తాన్.. కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్.. ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..
ICC Men’s ODI world cup Netherlands vs Afghanistan Playing XI: ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా అందులో మూడు గెలిచి మూడింటిలో ఓడింది. ఆప్ఘాన్ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. సెమీ ఫైనల్ రేసులో ఆఫ్ఘనిస్థాన్ దూసుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నెదర్లాండ్స్‌తో జరిగే ఈ మ్యాచ్ ఆఫ్ఘాన్ జట్టుకు చాలా కీలకం. ఇక్కడ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న ఆశలు మరింత బలపడతాయి.
ICC Men’s ODI world cup Netherlands vs Afghanistan Playing XI: 2023 వన్డే ప్రపంచకప్‌లో 34వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ టీం నెదర్లాండ్స్‌తో నేడు అంటే నవంబర్ 3న తలపడుతోంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ టీం తొలుత బ్యాటింగ్ ఎంచుకంది. ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్థాన్ తొలిసారి తలపడనున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా అందులో మూడు గెలిచి మూడింటిలో ఓడింది. ఆప్ఘాన్ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. సెమీ ఫైనల్ రేసులో ఆఫ్ఘనిస్థాన్ దూసుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నెదర్లాండ్స్‌తో జరిగే ఈ మ్యాచ్ ఆఫ్ఘాన్ జట్టుకు చాలా కీలకం. ఇక్కడ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న ఆశలు మరింత బలపడతాయి.
కాగా, నెదర్లాండ్స్ జట్టు ఆరు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి నాలుగు ఓడిపోయి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ కూడా సెమీ-ఫైనల్ రేసులో నిలిచింది. అయితే వారి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే, వారు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశం ఉంది.
హెడ్-టు-హెడ్, ఇటీవలి రికార్డులు..
రెండు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 9 వన్డేలు జరిగాయి. ఆఫ్ఘనిస్థాన్ 7 మ్యాచ్‌లు, నెదర్లాండ్స్ 2 మ్యాచ్‌లు గెలిచాయి.
ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగలేదు.
గత ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య చివరి వన్డే జరిగింది. ఇందులో ఆఫ్ఘనిస్థాన్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఆఫ్ఘన్ జట్టు గెలిస్తే నెదర్లాండ్స్‌పై వన్డేల్లో వరుసగా 5వ విజయం సాధించినట్లవుతుంది. 2012లో ఆఫ్ఘనిస్థాన్‌పై నెదర్లాండ్స్ చివరి వన్డే విజయం సాధించింది.
ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్.
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కీపర్/కెప్టెన్), బాస్ డి లీడే, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..