Hardik Pandya: హార్దిక్‌తో విడాకుల రూమర్లు.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన నటాషా.. ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టేగా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో నటాషా స్టాంకోవిచ్, హార్దిక్ పాండ్యా విడాకుల గురించి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వీరిద్దరి మధ్య అసలేం జరుగుతుంతో అర్థం కాక వీరి సోషల్‌మీడియా పోస్ట్‌లు, ఫొటోలను అభిమానులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

Hardik Pandya: హార్దిక్‌తో విడాకుల రూమర్లు.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన నటాషా.. ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టేగా!
Hardik Pandya, Natasa Stankovic

Updated on: Jun 03, 2024 | 10:02 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో నటాషా స్టాంకోవిచ్, హార్దిక్ పాండ్యా విడాకుల గురించి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వీరిద్దరి మధ్య అసలేం జరుగుతుంతో అర్థం కాక వీరి సోషల్‌మీడియా పోస్ట్‌లు, ఫొటోలను అభిమానులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన గత రెండు ఐపీఎల్‌లలో, నటాషా స్టాంకోవిచ్ స్టేడియానికి వచ్చిన హార్దిక్‌ను ఉత్సాహపరిచింది. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో మాత్రం నటాషా ఏ స్టేడియంలోనూ కనిపించలేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఆమె హార్దిక్ పాండ్యాతో కలిసి దిగిన ఒక్క ఫొటోను కూడా పోస్ట్ చేయలేదు. అలా ఇద్దరి మధ్య బ్రేకప్ చర్చ మొదలైంది. కొందరు ఇంకా ముందుగు అడుగేసి విడాకుల విషయంలో నటాషాకు ఎంత ఆస్తి వస్తుందనే దానిపై మీడియాలో వాడివేడిగా చర్చ కూడా జరిపారు. బయట ఇంత జరుగుతున్నా హార్దిక్, నటాషా ఇద్దరూ సైలెంట్‌గా ఉండడం విడాకుల రూమర్లకు మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే ఇప్పుడు నటాషా స్టాంకోవిచ్ ఒక అడుగు ముందుకు వేసింది. తద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే.. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హార్దిక్ పాండ్యాతో ఉన్న అన్ని ఫోటోలను రీస్టోర్ చేసింది. ఇందులో వాలెంటైన్స్ డే ఫోటోలు కూడా ఉన్నాయి.

హార్దిక్‌తో నటాషా ఫోటోలు మళ్లీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఇప్పుడీ విడాకుల పుకార్లకు చెక్ పడినట్టేనని అభిమానులు భావిస్తున్నారు. నటాషా తీసుకున్న ఈ నిర్ణయంతో హార్దిక్ ఫ్యాన్స్ కూడా హ్యాఫీగా ఫీలవుతున్నారు. అయితే ఆమె తన సోషల్ మీడియా బయో నుండి పాండ్యా ఇంటిపేరును ఎందుకు తొలగించింది? ఫోటోలు ఎందుకు తీసేసింది? మరి ఎందుకు మళ్లీ పునరుద్ధరించింది? అన్నదానికి మాత్రం కారణాలు తెలియరావడం లేదు. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి పాండ్యా ఇంటిపేరు, హార్దిక్‌తో ఉన్న ఫోటోలను తొలగించింది. దీంతో విడాకుల చర్చలు ఊపందుకున్నాయి. ఇంతలో నటాషా తన స్నేహితుడితో కలిసి ఉన్న ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిని చూసిన వారందరూ నటాషా జీవితంలోకి మరో వ్యక్తి వస్తున్నాడని రూమర్లు వ్యాపింప జేశారు.

ఇవి కూడా చదవండి

నటాషా ఇన్ స్టా గ్రామ్ లో హార్దిక్ పాండ్యా ఫొటోలు..

హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ ఆడేందుకు అమెరికాలో ఉన్నాడు. అతను టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతను సమర్థవంతంగా రాణించలేకపోయాడు. దీంతో అతను భారీ ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..