IPL 2025: విరాట్ కోహ్లీ వల్లే నా కొడుకు కెరీర్ ఇలా అయింది: బౌలర్ తండ్రి
చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆర్‌సీబీ విజయంలో యష్ దయాల్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శించాడు. చివరి ఓవర్‌లో ధోనీ, జడేజాను అడ్డుకుని RCB గెలుపుకు కారణమయ్యాడు. విరాట్ కోహ్లీ యష్ దయాల్‌కు మార్గదర్శకత్వం వహించి, అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని అతని తండ్రి తెలిపారు.

మే 3న చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంలో ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్‌లో సీఎస్‌కే గెలవడానికి 15 పరుగులు అవసరం.. బెస్ట్ ఫినిషర్‌గా పేరుగాంచిన ధోనీ స్ట్రైక్‌లో ఉండగా, నాన్-స్ట్రైక్‌లో జడేజా ఉన్నాడు. అయినప్పటికీ చెన్నై గెలవలేకపోయింది. అందుకు కారణం యష్ దయాల్. గత సీజన్‌లో కూడా యశ్ దయాల్ సీఎస్‌కేపై ఇలాంటి ప్రదర్శనే ఇచ్చాడు. గత సీజన్ మ్యాచ్‌లో ధోనీ, జడేజా క్రీజులో ఉన్నప్పటికీ చివరి ఓవర్‌లో 17 పరుగులు కొట్టేలేకపోయారు. ఇన్‌ఫ్యాక్ట్ దయాల్ కొట్టనివ్వలేదు. ఒకప్పుడు 5 బంతుల్లో 5 సిక్సర్లు ఇచ్చి ఒక బ్యాడ్ రికార్డును తన పేరిట లిఖించుకున్న యష్ దయాల్ ఇప్పుడు ఆర్సీబీకి బిగ్ అసెట్‌గా మారాడు. దయాళ్ లో ఈ మార్పుకు విరాట్ కోహ్లీ కారణమని దయాళ్ తండ్రి అంటున్నారు.
దయాళ్ కెరీర్‌ను కోహ్లీ మార్చాడు..
యష్ దయాల్ ప్రదర్శన గురించి అతని తండ్రి మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీ వల్లే నా కొడుకు ఈరోజు స్వేచ్ఛగా ఆడుతున్నాడు. జట్టు విజయంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. విరాట్ కోహ్లీ నా కొడుకు ఆర్‌సిబిలో చేరినప్పటి నుండి అతనితో నిరంతరం మాట్లాడుతున్నాడు. కోహ్లీ తరచుగా దయాల్‌ను తన గదికి పిలిచి మాట్లాడుతుంటాడు. చాలా సార్లు, అతనే స్వయంగా యష్ గదికి వెళ్లి ఆట గురించి వివరిస్తాడు. “నేను మీతో ఉన్నాను, చింతించకండి, తప్పులు చేయండి కానీ వాటి నుండి నేర్చుకుని ముందుకు సాగండి” అని కోహ్లీ దయాల్‌కు సలహా ఇచ్చాడని యష్ దయాల్ తండ్రి పేర్కొన్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




