GT vs MI Playing XI: టాస్ గెలిచిన ముంబై.. హార్దిక్ ఎంట్రీతో తగ్గేదేలే అంటోన్న ముంబై
Gujarat Titans vs Mumbai Indians, 9th Match: ఐపీఎల్ 2025లో 9వ మ్యాచ్‌లో ఈరోజు 2022 ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, 5 సార్లు విజేత ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. హార్దిక్ పాండ్యా ముంబై జట్టులోకి తిరిగి వస్తున్నాడు. నిషేధం కారణంగా అతను మొదటి మ్యాచ్‌లో ఆడలేదు. 2022లో, హార్దిక్ కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌గా నిలిచింది.

Gujarat Titans vs Mumbai Indians, 9th Match: ఐపీఎల్ 2025 9వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతోంది. ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చాడు. నిషేధం కారణంగా అతను మొదటి మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. 2022లో, హార్దిక్ కెప్టెన్సీలో గుజరాత్ టీం ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ సీజన్‌లో గుజరాత్ తమ తొలి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడింది. అక్కడ పంజాబ్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. అదే సమయంలో, ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇటువంటి పరిస్థితిలో, రెండు జట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రస్తుత సీజన్‌లో తమ ఖాతాను తెరవాలని కోరుకుంటున్నాయి.
ఇరు జట్లు:
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ ఉర్ రెహమాన్, సత్యనారాయణ రాజు.
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ.
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: రాబిన్ మింజ్, అశ్వని కుమార్, రాజ్ బావా, కార్బిన్ బాష్, విల్ జాక్స్.
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ ఫిలిప్స్, ఇషాంత్ శర్మ, అనుజ్ రావత్, వాషింగ్టన్ సుందర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








