IPL 2023: ఇవాళ ముంబైతో తలపడనున్న సన్‌రైజర్స్‌.. ‘పదండి ఉప్పల్’ కు అంటూ తెలుగులో మాట్లాడి అలరించిన రోహిత్‌

|

Apr 18, 2023 | 6:47 AM

రెండు వరుస ఓటములతో టోర్నీని ప్రారంభించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌, కేకేఆర్ జట్లను మట్టికరిపించింది. మరోవైపు ముంబై సైతం సన్‌రైజర్స్ తరహాలోనే తొలి రెండు మ్యాచ్‌లు ఓడి తర్వాతి మ్యాచ్‌ల్లో వరుస విజయాలందుకొని జోరు మీద ఉంది. దాంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది

IPL 2023: ఇవాళ ముంబైతో తలపడనున్న సన్‌రైజర్స్‌.. పదండి ఉప్పల్ కు అంటూ తెలుగులో మాట్లాడి అలరించిన రోహిత్‌
Srh Vs Mi
Follow us on

ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండు వరుస విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు వరుస ఓటములతో టోర్నీని ప్రారంభించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌, కేకేఆర్ జట్లను మట్టికరిపించింది. మరోవైపు ముంబై సైతం సన్‌రైజర్స్ తరహాలోనే తొలి రెండు మ్యాచ్‌లు ఓడి తర్వాతి మ్యాచ్‌ల్లో వరుస విజయాలందుకొని జోరు మీద ఉంది. దాంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. మరో థ్రిల్లింగ్ మ్యాచ్ అభిమానులను కనువిందు చేయనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్టార్ ఆటగాళ్లంతా ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం కాగా.. చెత్త ఫీల్డింగ్ అభిమానులను ఆందోళన పరుస్తోంది. మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్ జట్టు సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు చేరుకోగానే ఒక్కసారిగా సందడి నెలకొంది. ఎయిర్‌పోర్ట్‌లో ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీగా వచ్చారు. రోహిత్ శర్మ, సచిన్ టెండుల్కర్ లనూ చూసి అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. రోహిత్ శర్మను అభిమానులు హిట్‌మ్యాన్‌ అంటూ కేకలు వేశారు. దీంతో రోహిత్ శర్మ అభిమానులకు అభివాదం చెప్తూ ముందుకు కదిలాడు.

మేం వచ్చేశాం..

క్రికెట్ ఆటగాళ్లను భారీ బందోబస్తు నడుమ ప్రత్యేక బస్సులు నగరంలోని పార్క్ హయత్ హోటల్ కి తీసుకెళ్లారు. అనంతరం ప్రాక్టీస్ స్టార్ట్‌ చేశారు. మరోవైపు రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడిన వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోకు క్యాప్షన్ కూడా ‘కెప్టెన్ రోహిత్‌ హైదరాబాద్ వచ్చేసాడు’అని తెలుగులో పెట్టింది. ఈ వీడియోలో రోహిత్ మాట్లాడుతూ..’ముంబై ఫ్యాన్స్.. మేం వచ్చేస్తాం.. పదండి ఉప్పల్‌కు’అని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఫిదా అయిన ఫ్యాన్స్.. రోహిత్ శర్మ స్వాగతం పలుకుతూ కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..