Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: అతడు జేబులు కొట్టే దొంగ కన్నా డేంజర్! ‘తల’ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శాస్త్రి!

ఎంఎస్ ధోని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించడంతో భారత క్రికెట్‌కు గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి చేసిన “పిక్ పాకెట్ కంటే వేగం” అనే హాస్య వ్యాఖ్య అభిమానులను కడుపుబ్బా నవ్వించగా, ధోని వికెట్ కీపింగ్ ప్రతిభకు చక్కటి ఉదాహరణగా నిలిచింది. ధోని శాంతస్వభావం, ఒత్తిడిలో స్థిరత, వ్యూహాత్మక నాయకత్వం ఆయన్ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసింది. అతను ఇప్పటికీ అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచే క్రికెట్ మహానుభావుడిగా ఉంటాడు. 

MS Dhoni: అతడు జేబులు కొట్టే దొంగ కన్నా డేంజర్! 'తల' పై షాకింగ్ కామెంట్స్ చేసిన శాస్త్రి!
Ravi Shastri Ms Dhoni
Follow us
Narsimha

|

Updated on: Jun 11, 2025 | 9:50 AM

భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు ఎంఎస్ ధోని. రెండు వరల్డ్ కప్స్‌ గెలిపించిన కెప్టెన్ కూల్ ప్రస్తుతం మరో గొప్ప గౌరవాన్ని తన ఖాతాలో చేర్చుకున్నాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ధోనికి ప్రపంచవ్యాప్తంగా నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన హాస్యభరితమైన శుభాకాంక్షలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “పిక్ పాకెట్ కంటే వేగంగా చేతులు సంపాదించాడు” అంటూ శాస్త్రి చేసిన వ్యాఖ్య క్రికెట్ అభిమానుల్లో చక్కటి నవ్వులు పుట్టించింది. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి మాట్లాడుతూ, “మీరు భారతదేశంలో, ముఖ్యంగా అహ్మదాబాద్‌లో పెద్ద ఆటకు వెళ్తున్నట్లయితే మీ వెనక ధోని ఉండకూడదు… ఎందుకంటే అతని చేతులు జేబుదొంగల కంటే వేగంగా ఉంటాయి” అని సరదాగా వ్యాఖ్యానించారు.

ధోని సాధించిన విజయాలు మాటల్లో వర్ణించలేనివి. అతని శాంతస్వభావం, ఒత్తిడిలో కూడా చూపించే స్థిరత, మ్యాచ్‌ను తన రీతిలో మలచుకునే వ్యూహాత్మక తీరు అద్భుతం. స్టంప్స్ వెనుక మెరుపు వేగంతో వికెట్లు పడగొట్టే అతని నైపుణ్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. రవిశాస్త్రి కూడా ధోనిలోని ప్రశాంతతను ప్రత్యేకంగా ప్రశంసించారు. “అతను సున్నాకే ఔటవుతాడు, ప్రపంచకప్ గెలుస్తాడు, వంద చేస్తాడు, రెండువందలు చేస్తాడు… కానీ ఎప్పుడూ అదే ముఖాన్ని చూపిస్తాడు. ఒక్క తేడా కూడా కనిపించదు” అని ఆయన అన్నారు.

ధోనికి ఈ గౌరవం దక్కడం అనేది భారత క్రికెట్‌కు గర్వకారణం. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కిన 11వ భారతీయ ఆటగాడిగా ఎంఎస్ ధోని నిలిచాడు. క్రికెట్‌లో అతని సేవలు, కెప్టెన్సీ నైపుణ్యం, మైదానంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవన్నీ అతన్ని ఈ స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పటికీ అభిమానుల మనసులో ‘తల’గా ఉండే ధోనికి ఇది న్యాయమైన గుర్తింపుగా నిలిచింది. రవిశాస్త్రి చెప్పిన హాస్య వ్యాఖ్యలైతే అభిమానులను నవ్విస్తూనే, ధోని ప్రతిభను కొత్త కోణంలో పరిచయం చేశాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..