WTC Final 2025: రెండో రోజే ఫైనల్ కి వరుణ్ బ్రో ముప్పు! రద్దయితే ఎలా మరి?
WTC 2025 ఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ ‘అల్టిమేట్ టెస్ట్’గా పిలవబడే పోరులో ఆస్ట్రేలియా తమ టైటిల్‌ను కాపాడుకోవాలని ఆశిస్తుంటే, ప్రోటీస్ మాత్రం తమ తొలి WTC గెలుపుతో పాటు ప్రపంచ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని రాసేందుకు సిద్ధమవుతోంది. ఇది ప్రోటీస్‌కు తొలి ఫైనల్ కాగా, టైటిల్ కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే జూన్ 12 వర్ష సూచనలతో మ్యాచ్‌పై సస్పెన్స్ నెలకొంది. వర్షం వల్ల ఫలితం రాకపోతే, టైటిల్‌ను రెండు జట్లు పంచుకోవాల్సి వస్తుంది. ఆటగాళ్ల ప్రదర్శనతోపాటు వాతావరణం కూడా ఫలితంపై కీలక ప్రభావం చూపనుంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఈ ప్రతిష్టాత్మక ఫైనల్‌లో దక్షిణాఫ్రికా బలమైన ఆస్ట్రేలియా జట్టును లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జూన్ 11 నుంచి పోరాడనుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే 2023లో భారత్‌పై విజయం సాధించి WTC టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు అదే టైటిల్‌ను కాపాడుకునే దిశగా దూసుకుపోతుంది. మరోవైపు, దక్షిణాఫ్రికా ఇదే మొదటి WTC ఫైనల్ కాగా, గతంలో 1998 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఏ ఇతర ICC ట్రోఫీ గెలవకపోవడం ప్రోటీస్ కి ఈ మ్యాచ్‌కు ప్రత్యేకతనిస్తుంది. 27 సంవత్సరాల తర్వాత ICC టైటిల్‌ను తలపెట్టే ఈ జట్టు మరింత ఒత్తిడితో కూడిన పరిస్థితిలో ఉంది.
ఈ హై వోల్టేజ్ ఫైనల్‌ను అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ, వాతావరణం మాత్రం అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూన్ 12న వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. దీనివల్ల ఆటలో ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. అయితే ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని, మ్యాచ్ కోసం రిజర్వ్ డేను ఏర్పాటు చేశారు. అయినా కూడా, వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దవుతే లేదా నిర్ణీత ఆరు రోజులలో ఫలితం రాకపోతే, మ్యాచ్ డ్రాగా ప్రకటించబడుతుంది. అప్పుడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండు జట్లు కలసి టైటిల్‌ను పంచుకోవాల్సి ఉంటుంది.
ఈ ‘అల్టిమేట్ టెస్ట్’గా పిలవబడే పోరులో ఆస్ట్రేలియా తమ టైటిల్‌ను కాపాడుకోవాలని ఆశిస్తుంటే, ప్రోటీస్ మాత్రం తమ తొలి WTC గెలుపుతో పాటు ప్రపంచ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని రాసేందుకు సిద్ధమవుతోంది. ఆట పరంగా చూస్తే, ఆస్ట్రేలియా విజయానికి ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కీలకం కానున్నాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు 19 మ్యాచ్‌లు ఆడిన ఖవాజా, 37 ఇన్నింగ్స్‌ల్లో 1,422 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి 6,000 పరుగుల మైలురాయిని చేరడానికి ఇంకా 70 పరుగులే కావాలి.
ఆస్ట్రేలియా బౌలింగ్ దళంలో పాట్ కమ్మిన్స్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఎందుకంటే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైన్‌అప్‌లో టెంబా బావుమా, ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్ వంటి శక్తివంతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రోటీస్ బ్యాటింగ్ దాడిని కట్టడి చేయడానికి పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ వంటి సీనియర్ బౌలర్లు తమ అనుభవాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ ఫైనల్ విజేత ఎవరు అవుతారు అనేది వర్షం, ఆటగాళ్ల ప్రదర్శన, ఆటకు సంబంధించిన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఏదైనా ఫలితం వచ్చినా, ఈ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు మరుపురాని అనుభవాన్ని అందించనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..