MS Dhoni-Shafali Verma: 2007లో ధోనీ.. 2023లో షెఫాలీ.. సేమ్ టూ సేమ్.. ట్రోఫీ భారత్‌దే అంటోన్న చరిత్ర.. అవేంటంటే?
U19 Women's World Cup 2023 Final: ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను తొలిసారి నిర్వహిస్తోంది. ఇందులో భారత్, ఇంగ్లండ్ టీంలు ఫైనల్ చేరాయి. తొలిసారిగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో మొదటి విజేతగా నిలవడం చాలా ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

జనవరి 29 ఆదివారం భారత క్రికెట్‌కు చాలా ఆసక్తికరమైన రోజు కానుంది. భారత మహిళా క్రికెట్ జట్టు యువ బ్యాటర్ షెఫాలీ వర్మ చరిత్రలో తన పేరును లిఖించే అవకాశం ఉంది. 15 ఏళ్ల క్రితం తనలాంటి ఓ యంగ్ ఇండియన్ స్టార్ చేసిన పనిని ఆమె చేసేందుకు సిద్ధమైంది. మొదటి అవకాశంలో ప్రపంచాన్ని జయించేందుకు రెడీ అయింది. ఎన్నో రకాల యాదృచ్ఛికాలు వర్మను విజేతగా తేల్చేస్తున్నాయి. అందులో ఒకటి దశాబ్దంన్నర క్రితం మహేంద్ర సింగ్ ధోనీ చేసిన పనిని షెఫాలీ వర్మ చేయనుంది.
దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌లో ఆదివారం భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్లు ముఖాముఖిగా తలపడనున్నాయి. ఇందులో ఓ జట్టు చరిత్ర రాయడంపై దృష్టి సారిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను తొలిసారి నిర్వహిస్తోంది. ఇందులో భారత్, ఇంగ్లండ్ టీంలు ఫైనల్ చేరాయి. తొలిసారిగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో మొదటి విజేతగా నిలవడం చాలా ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ను ధోనీ కైవసం చేసుకున్నట్లే.. షఫాలీ వర్మ కూడా ఈ ట్రోఫీని గెలిచిన మొదటి కెప్టెన్‌గా అవతరించే అవకాశం ఉంది.
ధోనీ, షెఫాలీ @ ప్రపంచ కప్..
ఆదివారం ధోనీ విజయాన్ని షెఫాలీ రిపీట్ చేయగలదా లేదా అన్నది రాత్రికే తెలుస్తుంది. కానీ, ఈ రెండు విషయాల్లో మూడు పోలికలు ఉండటం యాదృచ్ఛికంగా అనిపిస్తుంది.




2007లో ఆడిన టీ20 ప్రపంచ కప్ ఈ ఫార్మాట్‌లో జరిగిన మొదటి గ్లోబల్ టోర్నమెంట్. అదేవిధంగా ప్రస్తుత ప్రపంచ కప్ అండర్-19 స్థాయిలో టీ20 ఫార్మాట్‌లో మొదటి గ్లోబల్ టోర్నమెంట్. ఇప్పటి వరకు అండర్-19లో పురుషుల ప్రపంచకప్ మాత్రమే ఉంది. అది కూడా వన్డే ఫార్మాట్‌లో ఉంది.
2007లో మొదటి ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ప్రపంచకప్ కూడా దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తున్నారు.
మూడవది, అతి ముఖ్యమైన యాదృచ్చికం ఏంటంటే- 2007 ప్రపంచకప్‌తో ధోని తొలిసారిగా భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అదే విధంగా, ప్రస్తుత ప్రపంచకప్‌తో, షఫాలీ వర్మ కూడా మొదటిసారిగా ఏ స్థాయిలో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
షెఫాలీ కూడా ఛాంపియన్ కెప్టెన్ అవుతుందా..
తొలి ప్రయత్నంలోనే ధోనీ, షెఫాలీలు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆ ప్రయాణాన్ని ధోనీ విజయవంతంగా గమ్యస్థానానికి చేర్చాడు. ఇప్పుడు షెఫాలీ వర్మ కూడా ధోనీలా అద్భుతాలు చేస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..