MS Dhoni: ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తండ్రి కాబోతున్న మహీ!..
ఐపీఎల్2021 ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ధోనీ నేతృత్వంలోని జట్టు నాలుగో సారి టైటిల్ కైవసం చేసుకుంది. ధోనీకి ఎదురు లేదంటూ అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్ గెలుపును ఆస్వాదిస్తున్న మహీ అభిమానులకు...
ఐపీఎల్2021 ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ధోనీ నేతృత్వంలోని జట్టు నాలుగో సారి టైటిల్ కైవసం చేసుకుంది. ధోనీకి ఎదురు లేదంటూ అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్ గెలుపును ఆస్వాదిస్తున్న మహీ అభిమానులకు సీఎస్కే బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా భార్య ప్రియాంక మరో గుడ్ న్యూస్ చెప్పినట్లు సమాచారం. . ధోని మళ్లీ తండ్రి కాబోతున్నాడని ఆమె తెలిపారని వార్తలు వస్తున్నాయి. మహీ భార్య సాక్షి ప్రస్తుతం నాలుగు నెలల గర్భంతో ఉందని ప్రియాంక వెల్లడించారని తెలుస్తోంది.
దీంతో నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా ధోనీకి కంగ్రాట్స్ చెబుతున్నారు. ధోనీ సాక్షి 2010లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2015లో వీరికి జీవా సింగ్ జన్మించింది. జీవా అంటే మహీకి చాలా ఇష్టం. ఖాళీ దొరికినప్పుడల్లా జీవాతో సరదాగా గడుపుతుంటాడు. జీవాతో ఉన్న వీడియోలు, ఫొటోలను సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే ధోని మళ్లీ తండ్రి కాబోతున్నట్లు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐపీఎల్ ఫైనల్లో చెన్నై గెలిచిన తర్వాత సాక్షి, జీవా ధోని వద్దకు వచ్చారు. వారిని ధోని కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ధోనీ టీ 20 ప్రపంచ కప్‌లో భారత జట్టకు మెంటర్‌గా పని చేయనున్నారు. అతను ఈ సేవలకు ఎలాంటి డబ్బు తీసుకోవడంలేదని బీసీసీఐ గతంలోనే తెలిపింది. టీ20 ప్రపంచ కప్ రేపటి నుంచి యూఏఈ, ఒమన్‌లో ప్రారంభం కానుంది. కాగా అక్టోబర్ 24న భారత్ పాక్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Priyanka Raina confirms that MS Dhoni’s wife Sakshi is pregnant. Ziva’s sibling and MS’ second child is soon arriving ????❤️#MSDhoni #SakshiDhoni #WhistlePodu pic.twitter.com/nnCseqA953
— Saiᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ? (@SaiPrabhas777) October 16, 2021
Priyanka Raina confirms that Sakshi Dhoni is pregnant for the second time ❤️ So Ziva will have a sibling soon
Congrats in advance @msdhoni @SaakshiSRawat ?
— DHONI Trends™ ? (@TrendsDhoni) October 15, 2021