IPL 2022: సరికొత్త జోష్‌తో రానున్న ఐపీఎల్ 2022.. మరో రెండు టీంల రాకతో మారనున్న లీగ్ స్వరూపం..! అన్ని జట్లలో భారీ మార్పులు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మరింత ఆసక్తికరంగా, సరికొత్త జోష్‌తో ప్రేక్షకుల ముందుకు రానుందని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జే షా అభిమానులకు హామీ ఇచ్చారు.
Indian Premier League 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 డబుల్ ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుందని భారత క్రికెట్ బోర్డు (బిసీసీఐ) కార్యదర్శి జే షా హామీ ఇచ్చారు. నిన్న జరిగిన ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ను 27 పరుగుల తేడాతో ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)నాల్గవ ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు జై షా చెన్నై సూపర్ కింగ్స్ టీంను అభినందించారు. ఇటీవల ముగిసిన సీజన్ ప్రతిఒక్కరికీ సవాలుగా నిలిచిదంటూ పేర్కొన్నారు. అయితే ప్రతీ ఒక్కరి నిబద్ధత, సంకల్పం, అంకితభావంతో ఐపీఎల్ 2021 లీగ్ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. “ప్రతిష్టాత్మకమైన #IPL2021 ని గెలిచుకున్న చెన్నై టీంకు అభినందనలు. ఇది మనందరికీ సవాలుతో కూడుకున్న సమయం. కానీ, ప్రతిఒక్కరూ వారి నిబద్ధత, సంకల్పం, అంకితభావం చూపించడంతోనే 14 వ సీజన్ విజయవంతంగా పూర్తయింది. 2022లో జరగబోయే ఐపీఎల్ డబుల్ జోష్‌తో మీ ముందుకు రానుంది” అంటూ జైషా ట్వీట్ చేశారు.
ఐపీఎల్ 2022 కోసం రెండు కొత్త జట్లు రాబోతున్న సంగతి తెలిసిందే. మెగా వేలానికి ముందు ఎంత మంది ఆటగాళ్లను ఫ్రాంచైజ్ నిలుపుకోనుందో చూడాలి. సీఎస్‌కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చాలా మంది సీఎస్‌కే ఆటగాళ్లను నిలుపుకోవడం కష్టమని అన్నారు. #IPL2022 కి ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.
” ఇది మాకు తెలియదు. ఐపీఎల్ 2022లో టీంలు ఎలా ఉంటాయో చూడాలని ఉంది. సీఎస్‌కే టీంలో కూడా ఇప్పుడున్న ఆటగాళ్లు వచ్చే ఏడాది కనిపించకపోవచ్చు” అని ఫ్లెమింగ్ తెలిపారు.
“సీఎస్‌కే టీం ఎక్కువ కాలం ఆటగాళ్లను తన వద్దే ఉంచుకుని, వారి నుంచి ఉత్తమమైన ఆటను పొందింది. అయితే రాబోయే కొద్ది రోజుల్లో ఐపీఎల్ 2022 ఎంపికలు జరగనున్నాయి. చాలా జట్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. అందులో సీఎస్‌కే కూడా ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.
Congratulations to @ChennaiIPL for lifting the prestigious #IPL2021?
This has been a challenging season for all of us but hats off to everyone for their commitment, determination & dedication.The 14th season will remain special. The @IPL from 2022 will get bigger & even better!
— Jay Shah (@JayShah) October 15, 2021