టికెట్ కలెక్టర్ టూ క్రికెటర్.. రూ. 1000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన కెప్టెన్ కూల్.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే?
MS Dhoni 44th Birthday Net Worth Career: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేడు తన 44వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ధోని అభిమానుల సంఖ్య తగ్గలేదు. అదే సమయంలో, అతని సంపాదన కూడా ప్రతి సంవత్సరం పెరుగుతోంది.

Ms Dhoni Birthday: ఈరోజు జులై 7, 2025న, భారత క్రికెట్‌లో అత్యంత ఫేమస్ ఆటగాళ్ళలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోని తన 44వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ‘కెప్టెన్ కూల్’ గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ దిగ్గజ క్రికెటర్ మైదానంలో తన అద్భుతమైన ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేయడమే కాకుండా, వ్యాపార ప్రపంచంలో కూడా ఒక సంచలనం సృష్టించాడు. దేశంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో ధోని ఒకరు, అతని సంపద ప్రతి సంవత్సరం కొత్త శిఖరాలను చేరుకుంటోంది.
44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘కెప్టెన్ కూల్’..
రాంచీలోని ఒక సాధారణ కుటుంబం నుంచి ధోని ప్రయాణం ప్రారంభమైంది. అక్కడ అతను తన కృషి, అభిరుచితో క్రికెట్ ప్రపంచంలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. 2004 లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తర్వాత, ధోని ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. అతను 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశాన్ని విజయపథంలో నడిపించాడు. అతని కెప్టెన్సీ, ప్రశాంతమైన స్వభావం అతన్ని అభిమానుల అభిమానంగా మార్చాయి. దీంతో పాటు, IPLలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో ఐదు టైటిళ్లను గెలుచుకున్న రికార్డును కూడా అతను కలిగి ఉన్నాడు. ఈ విజయాలు అతనికి గౌరవాన్ని సంపాదించిపెట్టడమే కాకుండా అతనికి బలమైన ఆర్థిక పునాదిని కూడా అందించాయి.
రూ. 1000 కోట్లకు పైగా నికర విలువ..
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ధోని సంపాదనలో ఎలాంటి తగ్గుదల లేదు. మీడియా నివేదికల ప్రకారం, అతని మొత్తం నికర విలువ 120 మిలియన్ US డాలర్లు అంటే 1000 వేల కోట్ల రూపాయలు. రిటైర్మెంట్ తర్వాత అతని సంపాదనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఒక ముఖ్యమైన వనరుగా మారింది. 18 సీజన్లలో IPLలో పాల్గొన్న తర్వాత, IPL నుంచి అతని సంపాదన రూ. 204.4 కోట్లు. ఇది కాకుండా, ధోని బ్రాండ్ విలువలో ఎలాంటి తగ్గుదల లేదు. మీడియా నివేదికల ప్రకారం, 2025 నాటికి, ఎంఎస్ ధోని బ్రాండ్ విలువ రూ. 803 కోట్లు (సుమారు 95.6 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా.
క్రికెట్ కాకుండా ఇంకేం చేస్తాడంటే..
ధోని ఇతర వ్యాపార సంస్థలలో కూడా అడుగుపెట్టాడు. అది నేటి అతని సంపదలో ప్రధాన భాగం. ధోని క్రీడలు, ఫ్యాషన్, వినోదం, రియల్ ఎస్టేట్ సహా అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టాడు. అతని కంపెనీ ‘రాంచీ రేస్’ హాకీ జట్టు, ‘ధోని స్పోర్ట్స్’ వంటి ప్రాజెక్టులు అతనికి కొత్త గుర్తింపును ఇచ్చాయి. దీంతో పాటు, అతను అనేక పెద్ద బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. దాని నుంచొ చాలానే సంపాదిస్తాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారం నుంచి అతని వార్షిక ఆదాయం కోట్లలో ఉంటుంది.
మీడియా నివేదికల ప్రకారం, అతని ఆస్తులలో రాంచీలో ఒక విలాసవంతమైన ఫామ్‌హౌస్, దుబాయ్, ముంబైలలోని ఆస్తులు, లగ్జరీ కార్ల సేకరణ ఉన్నాయి. ధోనికి బైక్‌లు, కార్లంటే చాలా ఇష్టం. హమ్మర్ H2, ఆడి Q7, మిత్సుబిషి పజెరో SFX, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, ఫెరారీ 599 GTO, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్, నిస్సాన్ జోంగా, పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ Am, GMC సియెర్రా, మెర్సిడెస్ బెంజ్ GLE, రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో వంటి కార్లు ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..