AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Records: క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు జీరో.. ఎవరో తెలుసా?

Most ducks in Cricket: ముఖ్యంగా సెంచరీలు, వికెట్ల రికార్డులపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే, క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Cricket Records: క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు జీరో.. ఎవరో తెలుసా?
Cricket Records
Venkata Chari
|

Updated on: Jun 19, 2023 | 6:58 AM

Share

Cricket Records: క్రికెట్ మైదానంలో రికార్డుల గురించి మాట్లాడితే, ప్రతి ఒక్కరూ బ్యాట్స్‌మెన్స్, బౌలర్ల భారీ రికార్డుల గురించి మాట్లాడుతుంటారు. అయితే, పేలవ ప్రదర్శన గురించి మాత్రం చర్చ చాలా అరుదుగా వినిపిస్తుంది. ముఖ్యంగా సెంచరీలు, వికెట్ల రికార్డులపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే, క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1- ముత్తయ్య మురళీధరన్: శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టెస్టు, వన్డే, టీ20తో కలిపి మొత్తం 328 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి అతను జీరో వద్ద 59 సార్లు ఔటయ్యాడు. దీని ద్వారా మురళీధరన్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు సున్నాకి ఔట్ అయిన పేలవ రికార్డును సొంతం చేసుకున్నాడు.

2- కోర్ట్నీ వాల్ష్: వెస్టిండీస్ మాజీ పేసర్ కోర్ట్నీ ఆండ్రూ వాల్ష్ మొత్తం 264 ఇన్నింగ్స్‌లు ఆడి 54 సార్లు అవుట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

3- సనత్ జయసూర్య: శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య 651 ఇన్నింగ్స్‌లలో 53 సార్లు జీరో వద్ద ఔట్ అయ్యాడు.

4- గ్లెన్ మెక్‌గ్రాత్: ఆస్ట్రేలియన్ మాజీ స్పీడ్‌స్టర్ గ్లెన్ మెక్‌గ్రాత్ 207 ఇన్నింగ్స్‌లలో జీరో వద్ద 49 సార్లు జీరో వద్ద ఔట్ అయ్యాడు.

5- స్టువర్ట్ బ్రాడ్: ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఇప్పటివరకు 330 ఇన్నింగ్స్‌లు ఆడాడు. జీరో వద్ద 49 సార్లు జీరో వద్ద ఔట్ అయ్యాడు.

6- మహేల జయవర్ధనే: శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే మొత్తం 725 ఇన్నింగ్స్‌లలో 47 సార్లు జీరో వద్ద ఔట్ అయ్యాడు.

7- డేనియల్ వెట్టోరి: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి మొత్తం 383 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. 46 సార్లు జీరో వద్ద ఔట్ అయ్యాడు.

8- వసీం అక్రమ్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ 427 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో అతను సున్నా వద్ద 45 సార్లు అవుట్ అయ్యాడు.

9- జహీర్ ఖాన్: భారత్ తరపున అత్యధిక డక్ అవుట్‌ల రికార్డు జహీర్ ఖాన్ పేరిట ఉంది. టీమ్ ఇండియా మాజీ పేసర్ 232 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. ఆ సమయంలో అతను జీరో వద్ద 44 సార్లు ఔటయ్యాడు.

టీమిండియా తరపున అత్యధిక సార్లు జీరో వద్ద ఔటైన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా? మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు టాప్‌లో కనిపిస్తుంది. సచిన్ టెండూల్కర్ మొత్తం 782 ఇన్నింగ్స్‌లలో 34 సార్లు సున్నాకి ఔటయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..