టీమిండియా స్టార్ బౌలర్, హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ పుట్టిన రోజు ఇవాళ (మార్చి 13). ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు సిరాజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీసీసీఐ కూడా హైదరాబాదీ పేసర్ కు స్పెషల్ విషెస్ తెలిపింది. అలాగే సిరాజ్ కు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో కారు డ్రైవ్ చేస్తూ కనిపించిన సిరాజ్ జీవితంలో తాను పడ్డ కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘నా కుటుంబ సభ్యులు చదువుకోవాలని పట్టుబట్టారు. అయితే మేం అద్దె ఇంట్లో నివాసముండే వాళ్లం. ఇంట్లో మా నాన్న మాత్రమే సంపాదిస్తున్న వ్యక్తి. కాబట్టి ఆయనకు తోడుగా నేను పనికి వెళ్ళేవాడిని. ఒక క్యాటరింగ్ లో చేరాను. అక్కడ రుమాలీ రోటీలు కాల్చేవాడిని. ఈ ప్రయత్నంలో చాలా సార్లు నా చేతులు కాలిపోయాయి. రోజుకు రూ. 200 వస్తే 150 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాడిని. మిగతా 50 రూపాయలు నా దగ్గరే ఉంచుకునేవాడిని’ అని ఎమోషనల్ అయ్యాడు సిరాజ్.
మహ్మద్ సిరాజ్ గురించి బీసీసీఐ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సిరాజ్ జీవితం చాలా స్ఫూర్తిదాయకమంటూ పలువురు ప్రశంసిస్తున్నారు .అలాగే అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో భారత క్రికెట్ జట్టుకు మరిన్ని గొప్ప విజయాలు అందించాలంటూ సిరాజ్ కుబర్త్ డే విషెస్ చెబుతున్నారు. మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. అతను బీసీసీఐ ‘ఏ’ గ్రేడ్ ప్లేయర్ కూడా. ఇప్పటివరకు భారత్ తరఫున 27 టెస్టులు, 41 వన్డేలు, 10 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు.
🏠 𝙃𝙤𝙢𝙚𝙘𝙤𝙢𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙛𝙩. 𝙈𝙤𝙝𝙖𝙢𝙢𝙚𝙙 𝙎𝙞𝙧𝙖𝙟
As he celebrates his birthday, we head back to Hyderabad where it all began 👏
The pacer’s heartwarming success story is filled with struggles, nostalgia and good people 🤗
You’ve watched him bowl, now… pic.twitter.com/RfElTPrwmJ
— BCCI (@BCCI) March 13, 2024
Happy Birthday, Mohammed Siraj! ❤🔥
It’s time to topple the records and celebrate with some fiery spells this Summer, Miyan! 🔥
Here’s to many more years of Magic! See you in Bengaluru. 🙌✨#PlayBold #ನಮ್ಮRCB (1/2) pic.twitter.com/f3MogHLDkD
— Royal Challengers Bangalore (@RCBTweets) March 13, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..