Aus vs Pak: రిజ్వాన్ ఘోర తప్పిదం.. కట్‌చేస్తే.. పాక్ జట్టుకు 16 పరుగుల ‘పెనాల్టీ’.. ప్రపంచ రికార్డ్ మిస్

Australia vs Pakistan, 2nd ODI: పాకిస్తాన్ కొత్త ODI-T20 కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ ODIలో 6 క్యాచ్‌లు తీసుకున్నాడు. అయితే, ఈ సమయంలో అతను ఓ పొరపాటు చేశాడు. దాని కారణంగా అతని జట్టు పెద్ద నష్టాన్ని చవిచూసింది. దీంతో అతను ప్రపంచ రికార్డు కూడా చేయలేకపోయాడు.

Aus vs Pak: రిజ్వాన్ ఘోర తప్పిదం.. కట్‌చేస్తే.. పాక్ జట్టుకు 16 పరుగుల ‘పెనాల్టీ’.. ప్రపంచ రికార్డ్ మిస్
Mohammad Rizwan Catch Drop
Follow us
Venkata Chari

|

Updated on: Nov 08, 2024 | 4:34 PM

Australia vs Pakistan, 2nd ODI: ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఓ పొరపాటు చేశాడు. ఆ తర్వాత అతని జట్టు 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనితో పాటు, అతను భారీ ప్రపంచ రికార్డును కూడా కోల్పోయాడు. వాస్తవానికి, ఆస్ట్రేలియాపై పాక్ కెప్టెన్ ఆరుగురు బ్యాట్స్‌మెన్స్ క్యాచ్‌లు పట్టాడు. మరో క్యాచ్‌ను పట్టుకుని ఉంటే రిజ్వాన్ పేరు మీద ప్రపంచ రికార్డు ఉండేది. అతనికి అవకాశం లభించింది. కానీ, మిస్ చేశాడు. నసీమ్ షా బంతికి ఆడమ్ జంపా క్యాచ్ ఇచ్చాడు. కానీ రిజ్వాన్ ఈ సులభమైన క్యాచ్‌ను మిస్ చేశాడు. ఫలితంగా, అతను ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టలేకపోయాడు. పాకిస్తాన్ కూడా 16 పరుగులతో పెనాల్టీకి గురైంది.

పాక్‌పై 16 పరుగుల పెనాల్టీ ఎలా వచ్చిందంటే..

ఆడమ్ జంపా క్యాచ్‌ను పాక్ కెప్టెన్ జారవిడిచినప్పుడు, ఆ సమయంలో ఆస్ట్రేలియా స్కోరు 9 వికెట్లకు 147 పరుగులు. ఆ తర్వాత ఆడమ్ జంపా తన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుని ఆస్ట్రేలియా స్కోరును 163 పరుగులకు చేర్చాడు. దీంతో పాకిస్థాన్ 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన రిజ్వాన్..

మహ్మద్ రిజ్వాన్ ఒక క్యాచ్ పట్టినట్లయితే, అతను ఒక వన్డేలో 7 క్యాచ్‌లు పట్టిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడు అయ్యేవాడు. అయితే, ఇది జరగలేదు. ఒకే వన్డేలో 6 క్యాచ్‌లు పట్టడం 12వ సారి జరిగింది. ఒక వన్డేలో మొత్తం ఏడుగురు వికెట్ కీపర్లు 6 క్యాచ్‌లు పట్టిన ఘనత సాధించారు. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ వన్డేల్లో 4 సార్లు 6 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ రోజు రిజ్వాన్ అతన్ని అధిగమించే అవకాశం ఉంది. కానీ అలా జరగలేదు.

పాకిస్థాన్ పేలవమైన ఫీల్డింగ్..

అయితే, అడిలైడ్ వన్డేలో పాకిస్థాన్ ఫీల్డింగ్ చాలా పేలవంగా కనిపించింది. షాహీన్ తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 11 క్యాచ్‌లు తీసుకున్నాడు. 13 క్యాచ్‌లను కూడా వదులుకున్నాడు. ఈ సంఖ్య ఏ జట్టు ఆటగాడికైనా అవమానకరం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. షాహీన్ అఫ్రిదీ కీలక క్యాచ్‌ను జారవిడిచే ముందు పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్.. ఫీల్డింగ్‌లో పాక్ ఆటగాళ్లను నమ్మలేమని వ్యాఖ్యానించాడు. సరిగ్గా అదే కనిపించింది. మరుసటి క్షణంలో షాహీన్ క్యాచ్ జారవిడిచి, అదే నిజమని చాటి చెప్పాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..