BGT 2023: తొలి టెస్ట్ ఓటమితో.. మైండ్‌గేమ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా.. ఢిల్లీలో మా ‘స్పీడ్ స్టర్’ రీఎంట్రీ అంటూ ప్రకటన
India vs Australia: నాగ్‌పూర్ వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో టీమిండియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
India vs Australia: నాగ్‌పూర్ వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో టీమిండియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టెస్ట్ మొదలైన మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియా ఖేల్ ఖతం చేసిన టీమిండియా.. 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత స్పిన్ బౌలర్లను ఎదుర్కొనలేక చేతులెత్తేసిని ఆసీస్ జట్టు.. రెండు సార్లు ఆలౌట్ అయ్యారు. ఇక ఇరుజట్లు రెండో టెస్ట్ కోసం ఢిల్లీకి బయలుదేరనున్నాయి. ఈ క్రమంలో తొలి ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆస్ట్రేలియా భారీ స్కెచ్ సిద్ధం చేస్తోంది. రెండో టెస్ట్‌లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైందని క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడయాలో ప్రకటించింది.
తొలి ఓటమి ఎదురైన కొద్ది గంటల్లోనే ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఢిల్లీ టెస్ట్‌కు సిద్ధమంటూ ప్రకటించింది. వేలి గాయంతో తొలి టెస్ట్‌కు దూరమైన ఈ స్పీడ్ స్టర్.. కోలుకున్నాడని, రెండో టెస్ట్ ఆడేందుకు రెడీ అయ్యాడంటూ ప్రకటించింది. దీంతో టీమిండియా ఆటగాళ్లను మానసికంగా దెబ్బ తీసేందుకే ఇలాంటి ప్లాన్ చేసిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మిచెల్ ఇంకా కోలుకోలేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Mitchell Starc will link up with the Australian squad in Delhi with his recovery progressing well.@LouisDBCameron | #INDvAUS https://t.co/rMqXXpwBgV
— cricket.com.au (@cricketcomau) February 11, 2023
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..