IND vs AUS: ఇండోర్‌లో గెలిచేందుకు స్టీవ్ స్మిత్ భారీ స్కెచ్.. రంగంలోకి ఇద్దరు స్టార్ ప్లేయర్స్..
హోల్కర్ స్టేడియంలో భారత్‌తో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లి వద్ద ఉండేందుకు ఇంటికి తిరిగి వెళ్లాడు. అతని స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
హోల్కర్ స్టేడియంలో భారత్‌తో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లి వద్ద ఉండేందుకు ఇంటికి తిరిగి వెళ్లాడు. అతని స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అయితే ఫాస్ట్ బౌలింగ్‌లో కమిన్స్ స్థానంలో ఎవరు ఉంటారన్నది జట్టుకు సమస్యగా మారింది. అయితే, సమాధానం కూడా తెరపైకి వచ్చింది. మూడో టెస్టులో, ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్మిత్ మిచెల్ స్టార్క్ ఫిట్‌గా ఉన్నాడని, ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు.
స్టార్క్ గాయం కారణంగా మొదటి రెండు టెస్టుల్లో ఆడలేదు. మూడో టెస్టుకు ముందు కూడా అతను పూర్తిగా ఫిట్‌గా లేడని వార్తలు వచ్చాయి. అయితే స్మిత్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఫిట్‌గా ఉన్నాడని, ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని స్పష్టం చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఆందోళనకు తెరపడిందని అంటున్నారు.
ఈ సిరీస్‌లో స్టార్క్ తొలిసారి బరిలోకి..
స్టార్క్ ఫిట్‌గా ఉన్నాడని, ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని స్మిత్ చెప్పుకొచ్చాడు. స్టార్క్ తొలిసారి ఈ సిరీస్‌లో ఆడనున్నాడు. అలాగే ఆల్ రౌండర్ కెమెరూన్ గ్రీన్ కూడా ఫిట్ గా ఉన్నాడని, ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని ప్రకటించాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఆప్షన్లు ఉన్నాయని స్మిత్ తెలిపాడు. “గ్రీన్, స్టార్క్ ఇప్పుడు ఫిట్‌గా ఉన్నారు. దీనివల్ల మనం ఎవరితో కావాలంటే వారితో వెళ్లే అవకాశం ఉంటుంది. మాకు ఇప్పుడు మంచి ఎంపికలు ఉన్నాయి” అంటూ స్టార్క్ చెప్పుకొచ్చాడు
స్టార్క్ ప్రస్తుత కాలపు అత్యుత్తమ బౌలర్లలో ఒకటిగా పేరుగాంచాడు. అతను కమిన్స్ స్థానంలో అత్యంత అనుకూలమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే గాయం తర్వాత పునరాగమనం చేయడం అంత సులువు కాదు. వచ్చిన వెంటనే రాణించడం స్టార్క్‌కు సవాలుగా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్క్ పాత రంగులో కనిపిస్తాడా లేదా అన్నది చూడాలి.
ఆస్ట్రేలియా నిలవాలంటే గెలవాలి..
తొలి రెండు టెస్టుల్లోనూ ఓడియిన ఆస్ట్రేలియా జట్టు.. సిరీస్ గెలవాలన్న కల చెదిరిపోయింది. ఇప్పుడు సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశం మాత్రం ఉంది. ఇందుకోసం ఇండోర్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవక తప్పదు. లేకుంటే ఆ కల కూడా చెదిరిపోతుందన్నారు. అదే సమయంలో ఇండోర్ టెస్టులో గెలిచిన వెంటనే టీమ్ ఇండియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..