AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 6,6,6,6,4,4,4,4.. 77 రోజుల తర్వాత బరిలోకి.. తుఫాన్ స్ట్రైక్‌రేట్‌‌తో చెలరేగిన టీమిండియా అన్‌లక్కీ ప్లేయర్

Maharaja T20 Trophy: మహారాజా టీ20 ట్రోఫీ కొత్త సీజన్ తొలి రోజు చాలా కాలంగా టీం ఇండియాకు దూరంగా ఉన్న ఓ సీనియర్ టీమిండియా ప్లేయర్ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో, ఆ అనుభవజ్ఞుడైన బ్యాటర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

Video: 6,6,6,6,4,4,4,4.. 77 రోజుల తర్వాత బరిలోకి.. తుఫాన్ స్ట్రైక్‌రేట్‌‌తో చెలరేగిన టీమిండియా అన్‌లక్కీ ప్లేయర్
Manish Pandey
Venkata Chari
|

Updated on: Aug 12, 2025 | 7:24 AM

Share

Manish Pandey: మనీష్ పాండే మహారాజా టీ20 ట్రోఫీలో తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టోర్నమెంట్ ప్రారంభ రోజున అతను కేవలం 29 బంతుల్లో 58 పరుగులు చేసి మైసూర్ వారియర్స్ జట్టుకు విజయాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి, స్ట్రైక్ రేట్ 200.00గా ఉంది. ప్రస్తుతం భారత్‌లో పలు టీ20 లీగ్‌లు జరుగుతున్నాయి. ఇందులో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తోన్న టీ20 లీగ్ మహారాజా ట్రోఫీ కూడా ఒకటి. కొత్త సీజన్ ఆగస్టు 11 సోమవారం నుంచి ప్రారంభమైంది. సీజన్ రెండవ మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్ వర్సెస్ బెంగళూరు బ్లాస్టర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌తో, మైసూర్ కెప్టెన్ మనీష్ పాండే కూడా తిరిగి వచ్చాడు. అతను 77 రోజుల క్రితం మే 25న IPL 2025లో తన చివరి మ్యాచ్ ఆడాడు.

మైసూర్ వారియర్స్‌కు విజయం..

బెంగుళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మనీష్ పాండే మైసూర్ వారియర్స్ కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన మైసూర్ జట్టు ఒకానొక దశలో 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మనీష్ పాండే క్రీజులోకి వచ్చి, యువ బ్యాటర్ సుమిత్ కుమార్‌తో కలిసి ఆరో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కేవలం 29 బంతుల్లో 58 పరుగులు చేసి, మైసూర్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి

పాండే మెరుపులు..

ఈ ఇన్నింగ్స్‌లో మనీష్ పాండే ఆడిన షాట్లు ప్రేక్షకులను అలరించాయి. అతని ఫాస్ట్ బ్యాటింగ్, అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడింది. పాండే, సుమిత్ కుమార్‌తో కలిసి చివరి ఓవర్లలో దూకుడుగా ఆడారు. ఇది జట్టుకు మంచి స్కోరు రావడానికి సహాయపడింది. సుమిత్ కుమార్ కూడా 28 బంతుల్లో 44 పరుగులు చేసి, పాండేకు మంచి సహకారం అందించాడు.

బెంగుళూరు బ్లాస్టర్స్ ఓటమి..

181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు బ్లాస్టర్స్‌కు ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 66 పరుగులు చేసినప్పటికీ, మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో బెంగుళూరు జట్టు 19.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. మైసూర్ వారియర్స్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. మైసూర్ బౌలర్లలో ఎల్.ఆర్.కుమార్ 3 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్ విజయం మనీష్ పాండేకు, మైసూర్ వారియర్స్‌కు మంచి ప్రారంభాన్ని ఇచ్చింది. అతని ఈ మెరుపు ఇన్నింగ్స్ టోర్నమెంట్‌కు ఒక మంచి ఆరంభాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..