IPL 2023: బెంగళూరు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండోసారి కోహ్లీ vs నవీన్ పోరుకు అడ్డుపడిన బిగ్ విలన్?
RCB vs LSG, IPL 2023: మే 1న లక్నో వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్ ఉత్ హుక్ మధ్య ఏం జరిగిందో తెలిసిందే. అయితే, మరోసారి రెండు జట్ల మధ్య ఘర్షణను చూడాలనుకుంటున్న ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అందుతోంది.
ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆపై లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్‌లకు చేరుకున్నాయి. లక్నో మూడోస్థానంలో ప్లేఆఫ్‌కు చేరుకోవడంతో మరోసారి వాతావరణం వేడెక్కింది. లక్నో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌కు డిమాండ్ పెరిగింది. నిజానికి వీరిద్దరి మధ్య విపరీతమైన పోటీ ఉండటమే దీనికి కారణం. చివరిసారిగా ఇరు జట్లు ముఖాముఖి తలపడగా, గౌతమ్ గంభీర్, నవీన్-ఉల్-హక్ మైదానంలో విరాట్ కోహ్లీతో గొడవపడిన సంగతి తెలిసిందే.
దీంతో మైదానంలోనే కాదు.. నెట్టింట్లోనూ రచ్చ జరిగింది. ఈ కారణంగానే ఇరు జట్ల మధ్య కూడా సెపరేట్ మ్యాచ్ ప్రారంభం కాగా, ఎలిమినేటర్‌లో ఇరు జట్ల మధ్య పోరు ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలు అడియాసలు కానున్నాయి. బెంగళూరు ఐపీఎల్‌కు దూరంగా ఉండవచ్చని తెలుస్తోంది. నిజానికి, విరాట్ కోహ్లీ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది. గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరుకుంది.
View this post on Instagram
RCBపై విజయం లేదా ఓటమి గుజరాత్ నంబర్ వన్ స్థానానికి ఎటువంటి తేడాను కలిగించదు. కానీ, బెంగుళూరుకు మాత్రం ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్. గుజరాత్‌పై గెలిస్తేనే బెంగళూరు ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. సొంత మైదానంలో హార్దిక్ పాండ్యా గుజరాత్‌తో బెంగళూరు ఆడుతుంది. అయితే ఇది ఉన్నప్పటికీ, కోహ్లీతోపాటు బెంగళూరు ఫ్యాన్స్‌కు బిగ్ షాకింగ్ న్యూస్ వస్తోంది. వాతావారణం నుంచి బెంగళూరుకు బ్యాడ్ న్యూస్ అందుతోంది. బెంగళూరులో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. అలాగే ఈ రోజు కూడా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రాత్రి పూట కూడా వెదర్ ఇలానే ఉండోచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే బెంగళూరు, గుజరాత్ మ్యాచ్ జరగడం కష్టమేనని తెలుస్తోంది.
టాస్‌కే కాదు మ్యాచ్‌కు వర్షం అడ్డంకే..
బెంగళూరులో ఆదివారం ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. అక్యూవెదర్ ప్రకారం, సాయంత్రం 5 గంటలకు 51 శాతం, రాత్రి 7 గంటలకు 65 శాతం వర్షం పడే అవకాశం ఉంది. అంటే టాస్ సమయం నుంచి రాత్రి 9 గంటల వరకు వర్షం RCBని ఇబ్బంది పెట్టవచ్చు. నిజానికి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించాలంటే బెంగళూరుకు గుజరాత్‌పై ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం అవసరం. గుజరాత్‌పై విజయంతో 16 పాయింట్లతో టాప్ 4కి చేరుకుంటుంది. అప్పుడు బెంగళూరు, లక్నోతో ఢీకొట్టనుంది. ఇలా కాకుండా వర్షంతో మ్యాచ్ రద్దై, హైదరాబాద్ టీంపై ముంబై విజయం సాధిస్తే మాత్రం బెంగళూరు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..