LSG vs MI Playing 11: ‘కీ’ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై.. కీలక మార్పులతో బరిలోకి.. ప్లేఆఫ్స్ ఛాన్స్ ఎవరికో?

Lucknow Super Giants vs Mumbai Indians Playing XI & Imapct Players: ఇండియన్స్ (MI) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య మ్యాచ్ జరుగుతోంది. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

LSG vs MI Playing 11: 'కీ' మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై.. కీలక మార్పులతో బరిలోకి.. ప్లేఆఫ్స్ ఛాన్స్ ఎవరికో?
Lsg Vs Mi Live
Follow us
Venkata Chari

|

Updated on: May 16, 2023 | 7:11 PM

Lucknow Super Giants vs Mumbai Indians Playing XI & Imapct Players: ఇండియన్స్ (MI) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య మ్యాచ్ జరుగుతోంది. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నవీన్, దీపక్ హుడా లక్నోకు తిరిగి వచ్చారు. కైల్ మేయర్స్, అవేష్ ఖాన్ ఆటకు దూరంగా ఉన్నారు. ముంబై జట్టులో మార్పు వచ్చింది. కాగా, నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు నంబర్-2లోకి వస్తుంది.

ఒకవైపు ముంబై ఏదైనా తేడాతో గెలిస్తే నంబర్-2గా మారుతుండగా, లక్నో మాత్రం భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 5 ఓటములతో 14 పాయింట్లు ఉన్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే చెన్నైని వెనక్కి నెట్టి నంబర్-2కి చేరుకుంటుంది.

లక్నో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబైని వెనక్కి నెట్టేస్తుంది. 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 ఓటములు, ఒక డ్రాతో 13 పాయింట్లు ఖాతాలో ఉన్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే ముంబైతో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌ను అధిగమించి నంబర్-2కి చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు:

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆకాష్ మధ్వల్.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, స్వప్నిల్ సింగ్, మొహ్సిన్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..