IPL 2023: ఆర్మీకి వెళ్లమన్న తండ్రి.. డబ్బు కోసం క్రికెట్ ఆడతానన్న కొడుకు.. సీన్ కట్‌చేస్తే.. లక్కీ ఛాన్స్..

IPL-2023 వేలంలో ఈ ఆటగాడికి ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 5.5 కోట్లు చెల్లించింది. ఈ సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేయడంలో విజయం సాధించాడు.

IPL 2023: ఆర్మీకి వెళ్లమన్న తండ్రి.. డబ్బు కోసం క్రికెట్ ఆడతానన్న కొడుకు.. సీన్ కట్‌చేస్తే.. లక్కీ ఛాన్స్..
Mukesh Kumar Dc
Follow us

|

Updated on: Apr 01, 2023 | 9:01 PM

ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కి చాలా చేదు వార్త అందింది. కెప్టెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ కారణంగా మొత్తం సీజన్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఒక్క సీజన్‌లోనూ ఢిల్లీ టైటిల్‌ గెలవలేదు. పంత్ స్థానంలో 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టైటిల్‌ను అందించిన డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఢిల్లీ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కొత్త బౌలర్‌కు అవకాశం కల్పించింది. ఈ బౌలర్ పేరు ముఖేష్ కుమార్.

IPL-2023 వేలంలో రూ.5.5 కోట్ల ధరకు ముఖేష్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది. అతను సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లోనే IPL అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు.

ముఖేష్ కుమార్ ఎవరు?

ముఖేష్ బీహార్‌లోని గోపాల్‌గంజ్ నివాసి. అతను దేశీయ క్రికెట్‌లో కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను తన కెరీర్ కోసం బీహార్ నుంచి బెంగాల్ వెళ్లి విజయం సాధించాడు. అతను 2014లో ట్రయల్స్ ఇచ్చాడు. 2015-16లో బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ నుంచి అతని ప్రయాణం ఊపందుకుంది. అయితే అంతకు ముందు బీహార్, కోల్‌కతాలో కేవలం డబ్బుల కోసమే మ్యాచ్‌లు ఆడేవాడు. అతను అండర్-19 స్థాయిలో కూడా బీహార్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత 2012లో కోల్‌కతా వచ్చాడు. ఇక్కడ అతని తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ముఖేష్ ఆర్మీలో చేరాలని అతని తండ్రి కోరుకున్నాడు. కానీ, క్రికెటర్ కావాలనేది ముఖేష్ కల. చివరకు అందులో విజయం సాధించాడు. ముఖేష్ కూడా చాలాసార్లు టీమ్ ఇండియాలో నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. కానీ, అతను అరంగేట్రం చేయలేకపోయాడు.

ఐపీఎల్‌తో కెరీర్‌ మారేనా..

ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తూ తన కెరీర్‌లో మెరుపులు మెరిపించాలన్నదే ముఖేష్ ప్రయత్నం. ఈ లీగ్ చాలా మంది ఆటగాళ్లకు టీమ్ ఇండియా తలుపులు తెరిచింది. ఈ లిస్టులో ఇప్పుడు ముఖేష్ చేరాడు. ఢిల్లీతో అద్భుతమైన ఆటను ప్రదర్శించడం ద్వారా టీమిండియా జెర్సీని ధరించాలనుకుంటున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం