
Lucknow Super Giants vs Chennai Super Kings: లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో57 నాటౌట్, 5 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధశతకంతో రాణిస్తే.. ఎప్పటిలాగే ఆఖరులో ధోని ( 9 బంతుల్లో 28 నాటౌట్, 3ఫోర్లు 2 సిక్సర్లు ) మెరుపులు మెరిపించాడు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ధోని 311.11 స్ట్రైక్ రేట్‌తో 2 సిక్స్‌లు, 3 ఫోర్లతో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొయిన్ అలీ జడేజాకు బాగా మద్దతు ఇచ్చాడు. మొయిన్ 20 బంతుల్లో 30 పరుగులు జోడించాడు. మొయిన్ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు ఉన్నాయి. అంతకు ముందు ఓపెనర్ అజింక్య రహానే 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 36 పరుగులు చేశాడు. కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ 13 బంతుల్లో 17 పరుగులు చేశాడు. రరచిన్ 0, శివమ్ 3, రిజ్వీ 1 పరుగులతో నిరాశపర్చారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2 వికెట్లు పడగొట్టగా.. మోసిన్, యశ్ ఠాకూర్, బిష్ణోయ్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు.
𝙎𝙞𝙢𝙥𝙡𝙮 𝙞𝙣𝙘𝙧𝙚𝙙𝙞𝙗𝙡𝙚!
MS Dhoni smacks a 1⃣0⃣1⃣ metre SIX into the stands 💥
Lucknow is treated with an entertaining MSD finish 💛
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/XIT3O43l99
— IndianPremierLeague (@IPL) April 19, 2024
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివన్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా.
సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, మిచెల్ సాంట్నర్.
క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.
అర్షిన్ కులకర్ణి, కృష్ణప్ప గౌతమ్, యద్వీర్ సింగ్, మణి రామన్ సిద్ధార్థ్, అర్షద్ ఖాన్.
Innings Break!
An unbeaten fifty from Jadeja & a classic finish from MS Dhoni power #CSK to 176/6 👌👌
Will #LSG chase this down?
Scorecard ▶️ https://t.co/PpXrbLNaDm#TATAIPL | #LSGvCSK pic.twitter.com/uBywEDcPj9
— IndianPremierLeague (@IPL) April 19, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి