Watch Video: అంపైర్ నాటౌట్ ఇచ్చినా.. మైదానం వీడిన డికాక్.. ఎందుకో తెలుసా? వైరల్ వీడియో..
12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి చేరుకున్న లక్నోకు తొమ్మిది మ్యాచ్‌ల్లో ఇది ఆరో విజయంగా నిలిచింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు ఇది ఐదో ఓటమి. ఈ విజయంలో లక్నో బౌలర్లపై ఎంత చర్చ జరుగుతోందో.. డికాక్ విషయంలోనూ అదే జరుగుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో లక్నో బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. బ్యాటింగ్‌లో క్వింటన్ డి కాక్ 37 బంతుల్లో 46 పరుగులు చేసి ఆధిపత్యం ప్రదర్శించాడు. కానీ, ఈ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ అతని బ్యాటింగ్ గురించి ప్రస్తుతం నెట్టింట్లో చర్చల్లో నిలిచాడు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేసి ఆరంభం నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. ఫామ్‌లో ఉన్న రాహుల్ (6)ను వికెట్‌కీపర్ జితేష్ శర్మ క్యాచ్ పట్టడం ద్వారా రబాడ పంజాబ్‌కు కీలక వికెట్‌ను అందించాడు. అయితే డి కాక్ తన దక్షిణాఫ్రికా సహచరుడిపై ఆధిపత్యం చేయడానికి వ్యూహాన్ని అనుసరించాడు. రబాడ తర్వాతి ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. పవర్ ప్లేలో లక్నో 39 పరుగులు చేయగలిగింది.
ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో సందీప్ శర్మ వేసిన షార్ట్ పిచ్ బాల్‌లో వికెట్ వెనుక క్యాచ్ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించడంతో, డి కాక్ స్వయంగా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ క్రీజును వీడాడు. డికాక్ ఈ వైఖరికి సందీప్ శర్మ ఎంతగానో ఆకట్టుకున్నాడు. డికాక్ వీపు తడుతూ ఆకట్టుకున్నాడు.
లక్నో మిడిల్ ఓవర్లలో 13 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డి కాక్ (37 బంతుల్లో 46, నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లు), దీపక్ హుడా (28 బంతుల్లో 34, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) భారీ భాగస్వామ్యం(85 పరుగులు) అందించారు. కానీ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అందించిన ఉపయోగకరమైన సహకారంతో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగలిగింది.
అయితే లక్నో బౌలర్లు ఈ స్కోరును పంజాబ్‌కు కొండంత అండగా నిలిచారు. పంజాబ్ నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోయి, పరాజయం పాలైంది. చివరికి పంజాబ్ జట్టు ఎనిమిది వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. జానీ బెయిర్‌స్టో అత్యధికంగా 32 పరుగులు చేశాడు.
Also Read: IPL 2022: స్టేడియం వద్దకు వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన గౌతమ్ గంభీర్..
PBKS vs LSG Highlights: రాణించిన దీపక్ హుడా.. 20 పరుగుల తేడాతో పంజాబ్‌పై లక్నో విజయం