AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : 22 ఏళ్లుగా చెక్కుచెదరని సౌరవ్ గంగూలీ రికార్డు.. లార్డ్స్ వన్డే వేదికగా భారత్‌కు అగ్నిపరీక్ష

IND vs ENG : లార్డ్స్ వేదికగా భారత్‌కు 22 ఏళ్ల సెంచరీ కరవుకు తెరపడేనా? సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేదా శుభ్‌మన్ గిల్ బద్దలు కొడతారా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. నిర్ణయాత్మక వన్డేలో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా సిద్ధమైంది.

IND vs ENG : 22 ఏళ్లుగా చెక్కుచెదరని సౌరవ్ గంగూలీ రికార్డు.. లార్డ్స్ వన్డే వేదికగా భారత్‌కు అగ్నిపరీక్ష
Rohit Sharma
Rakesh
|

Updated on: Jul 19, 2026 | 12:37 PM

Share

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సాగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. నేడు (ఆదివారం, జులై 19) లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో సిరీస్ విజేత ఎవరో తేల్చే ఆఖరి, మూడో వన్డే మ్యాచ్ జరగబోతోంది. తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేసినప్పటికీ, రెండో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (99 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో ఆతిథ్య జట్టు ఘనంగా పుంజుకుంది. ప్రస్తుతం సిరీస్ 1-1 తో సమం కావడంతో నేటి లార్డ్స్ మ్యాచ్ ఇరు జట్లకు ఫైనల్ లాంటిదిగా మారింది. అయితే లార్డ్స్ పిచ్ స్లోప్ బ్యాటర్లకు ఎప్పుడూ పెద్ద సవాల్‌గా నిలుస్తుంది.

నేటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవడమే కాకుండా, భారత బ్యాటర్ల ముంగిట ఒక సుదీర్ఘమైన నిరీక్షణకు తెరదించే భారీ అవకాశం ఉంది. లార్డ్స్ మైదానంలో భారత వన్డే చరిత్రను గమనిస్తే ఒక విచిత్రమైన, షాకింగ్ రికార్డు కనిపిస్తుంది. ఇప్పటివరకు టీమిండియా ఈ చారిత్రాత్మక మైదానంలో మొత్తం 9 వన్డే మ్యాచ్‌లు ఆడింది. అయితే ఆశ్చర్యకరంగా ఏ ఒక్క భారతీయ బ్యాటర్ కూడా ఇక్కడ వన్డేల్లో సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. ప్రపంచవ్యాప్తంగా భారత జట్టు 5 లేదా అంతకంటే ఎక్కువ వన్డేలు ఆడిన దాదాపు 64 వేర్వేరు మైదానాల రికార్డులను పరిశీలిస్తే, కేవలం లార్డ్స్‌లో మాత్రమే ఈ శతాబ్దాల కరవు కొనసాగుతోంది.

లార్డ్స్ వన్డేల్లో ఒక భారతీయ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు రికార్డు మాజీ కెప్టెన్, దాదా సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. ఆయన 2004 లో ఇంగ్లాండ్‌పై ఇక్కడ 90 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత గత 22 ఏళ్లుగా ఏ ఒక్క భారతీయ బ్యాటర్ కూడా ఆ స్కోరును దాటలేకపోయారు, సెంచరీ మార్కును చేరలేకపోయారు. లార్డ్స్ మైదానంలో భారత్ తరఫున టాప్-5 అత్యధిక స్కోర్ల వివరాలు చూస్తే.. సౌరవ్ గంగూలీ (90 రన్స్), మహ్మద్ కైఫ్ (87 నాటౌట్), సురేష్ రైనా (84 రన్స్), ఎంఎస్ ధోని (78 నాటౌట్), రాహుల్ ద్రవిడ్ (73 నాటౌట్) ఉన్నారు. ఈ జాబితాను బట్టి చూస్తే లార్డ్స్ పిచ్‌పై మనోళ్లకు పరుగులు చేయడం ఎంత కష్టంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సుదీర్ఘ సెంచరీ కరవును తీర్చే బాధ్యత అంతా నేడు భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లపైనే ఉంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఇంగ్లాండ్ పర్యటనలో ఇప్పటివరకు పెద్దగా రాణించలేదు. వరుసగా విఫలమవుతుండటంతో ఆయనపై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే నేటి చారిత్రాత్మక మ్యాచ్‌లో లార్డ్స్ మైదానంలో ఒక భారీ ఇన్నింగ్స్ లేదా సెంచరీ సాధిస్తే, విమర్శకుల నోళ్లు మూయించడంతో పాటు జట్టుకు సిరీస్ అందించే సువర్ణ అవకాశం హిట్‌మ్యాన్‌కు దక్కుతుంది. పిచ్ కండిషన్స్ కఠినంగా ఉన్నప్పటికీ, రోహిత్ తన సహజ శైలిలో ఆడితే లార్డ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించడం అసాధ్యమేమీ కాదు.

మరోవైపు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచినా, కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో 65 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. లార్డ్స్ పిచ్‌పై కోహ్లీ బ్యాట్ నుంచి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ఇంటర్నేషనల్ సెంచరీ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. వీరితో పాటు యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మొదటి వన్డే మ్యాచ్‌లో గిల్ 80 పరుగులతో అద్భుత ప్రదర్శన చేయగా, రెండో వన్డేలో 31 పరుగులు చేశాడు. గిల్ నేటి మ్యాచ్‌లో లభించే మంచి ఆరంభాన్ని ఒక భారీ సెంచరీగా మలచాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఎవరు సెంచరీ చేసినా భారత క్రికెట్ చరిత్రలో అదొక మరపురాని రికార్డుగా నిలిచిపోతుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us