T20 Cricket: పొట్టి ఫార్మాట్‌లో ఫుల్ కిక్కిచ్చే మ్యాచ్.. 100లోపే స్కోర్.. 35 రన్స్ తేడాతో విజయం..
ఫొట్టి ఫార్మాట్‌లో ఉత్కంఠ పీక్స్ లెవల్లో ఉంటుంది. ఇది అభిమానుల్లోనూ టెన్షన్ పెంచేలే చేస్తుంది. ఇప్పటి ఇలాంటి ఎన్నో మ్యాచ్‌లు మనం చూసే ఉంటాం. తాజాగా దోహాలో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ మాస్టర్స్‌లో ఇలాంటి అద్భుతమైన మ్యాచ్ కనిపించింది.
ఫొట్టి ఫార్మాట్‌లో ఉత్కంఠ పీక్స్ లెవల్లో ఉంటుంది. ఇది అభిమానుల్లోనూ టెన్షన్ పెంచేలే చేస్తుంది. ఇప్పటి ఇలాంటి ఎన్నో మ్యాచ్‌లు మనం చూసే ఉంటాం. తాజాగా దోహాలో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ మాస్టర్స్‌లో ఇలాంటి అద్భుతమైన మ్యాచ్ కనిపించింది. ఆసియా లయన్స్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది. ఓవైపు బౌలర్లు వికెట్లు పడేస్తుంటే.. మరోవైపు బ్యాటర్స్ పరుగుల వర్షం కురిపిస్తూనే సందడి చేస్తున్నారు.
జట్టు స్కోరు 99 పరుగులు.. మిస్బా ఒక్కడే 44 పరుగులు..
ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ 10 ఓవర్ల పాటు జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ 10 ఓవర్లలో 99 పరుగులు చేసింది. ఇందులో మిస్బా ఉల్ హక్ ఒక్కడే 44 పరుగులు చేశాడు. అతను కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 231 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడిన మిస్బా ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే ఆసియా లయన్స్ 100 పరుగులకు చేరువైంది.
35 పరుగుల తేడాతో ఓడిన వరల్డ్ జెయింట్స్..
వరల్డ్ జెయింట్స్ 10 ఓవర్లలో 100 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగింది. కానీ, ఆరోన్ ఫించ్ సారథ్యంలోని వరల్డ్ జెయింట్స్ 64 పరుగులకు మించి చేయలేకపోయింది. ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చినన్ని పరుగులు కూడా చేయలేకపోవడం గమనార్హం. ఫలితంగా ఆసక్తికరమైన మ్యాచ్‌కు అద్భుతమైన ముగింపు లభించింది. ఆసియా లయన్స్ 35 పరుగుల తేడాతో వరల్డ్ జెయింట్స్‌ను ఓడించింది. మిస్బా-ఉల్-హక్ మళ్లీ ఛాంపియన్ ప్లేయర్‌గా అవతరించాడు. ఆసియా లయన్స్ విజయంలో హీరోగా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..