PAK vs AFG: అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి.. పాక్-ఆఫ్ఘన్ టీ20 సిరీస్‌లో వెరైటీ రూల్.. అదేంటంటే?
PAK vs AFG T20I Series: మార్చి 25 నుంచి పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 అంతర్జాతీయ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్ల అభిమానులు వేర్వేరు స్టాండ్‌లలో కూర్చోనున్నారు.
PAK vs AFG T20I Series: మార్చి 25, శనివారం నుంచి పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ జరగనుంది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఆడుతున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో, రెండు జట్ల ఆటగాళ్ల మధ్య చాలా స్నేహభావం కనిపిస్తోంది. కానీ, అంతర్జాతీయ స్థాయిలో ఈ రెండు జట్లు బద్ధ శత్రువులుగా మారుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, టీ20 సిరీస్‌కు ముందు, మ్యాచ్ సమయంలో ఇరు జట్ల అభిమానులు ఒకే స్టాండ్‌లో కాకుండా వేర్వేరు స్టాండ్‌లలో కూర్చోవాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు.
షార్జా వేదికగా టీ20 సిరీస్ జరగనుంది. ఇక్కడ ఇరు జట్ల అభిమానులు కూర్చునేందుకు ప్రత్యేక స్టాండ్‌లు ఏర్పాటు చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఆటగాళ్లే కాకుండా స్టాండ్స్‌లోని అభిమానులు కూడా ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. 2022లో జరిగిన ఆసియాకప్‌లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. ఆ మ్యాచ్‌లో ముందుగా మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరగ్గా, ఆ తర్వాత స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు మళ్లీ గొడవకు దిగారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి..
బహుశా అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటిసారి, రెండు జట్ల క్రీడాకారులు వేర్వేరు స్టాండ్‌లలో తొలిసారి కూర్చోనున్నారు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఉత్కంఠ నెలకొంది. ఈ సిరీస్‌కు షాదాబ్ ఖాన్ పాకిస్థాన్ జట్టుకు బాధ్యతలు చేపట్టనున్నాడు.
మూడు మ్యాచ్‌ల సిరీస్ షెడ్యూల్..
పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్ – 1వ T20I – షార్జా క్రికెట్ స్టేడియం. (మార్చి 25, శుక్రవారం) పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్ – 2వ T20I – షార్జా క్రికెట్ స్టేడియం. (27 మార్చి, సోమవారం) పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్ – 3వ T20I – షార్జా క్రికెట్ స్టేడియం. (మార్చి 29 బుధవారం)
టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు..
షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజం ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇహ్సానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హారీస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, జమాన్ ఖాన్, తైబ్ తాహిర్, షాన్ మసూద్, సామ్ అయూబ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..