Video: ‘నాటు నాటు’ స్టెప్పులతో దుమ్మురేపిన టీమిండియా లిటిల్ మాస్టర్.. వైరల్ వీడియో..
Naatu Naatu Song: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు ఆస్కార్స్ 2023లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ ట్రాక్‌గా నిలిచింది.
IND vs AUS: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు ఆస్కార్స్ 2023లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ‘నాటు నాటు’ ఫీవర్ యావత్ భారతదేశాన్ని పట్టుకుంది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ చేసిన ఈ సినిమా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ ట్రాక్‌గా నిలిచింది. యావత్ భారతదేశం సినిమా విజయాన్ని సంబరాలు చేసుకుంటుండగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనూ దాని సందడి కనిపించింది. సిరీస్‌కు వ్యాఖ్యాత పనిచేస్తోన్న భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 5వ రోజు ఆట ప్రారంభానికి ముందు ‘నాటు నాటు’ స్టెప్స్‌తో సందడి చేశాడు.
ఆట ప్రారంభానికి ముందు వ్యాతలు అంతా నాటు నాటు సాంగ్‌కి స్టెప్పులు వేశారు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
మన తెలుగు పాట ✨ ?? నాటు నాటు ?? కు ? ఆస్కార్ రావటం గర్వకారణం ?
ఈ అరుదైన సందర్భం పై ?? లెజెండ్ సునీల్ గవాస్కర్ ? & స్టార్ స్పోర్ట్స్ తెలుగు టీం సంతోషాన్ని ?
మీరు చూసేయండి ?
Mastercard #INDvAUS #StarSportsTelugu #TestByFire? #RRR #RamCharan #SunilGavaskar #JrNTR pic.twitter.com/UVnaxilfz1
— StarSportsTelugu (@StarSportsTel) March 13, 2023
గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ తర్వాత ఎంఎం కీరవాణి స్వరపరిచిన, చంద్రబోస్ రచించిన చార్ట్‌బస్టర్ “నాటు నాటు”కి ఇది మూడవ అతిపెద్ద అంతర్జాతీయ గుర్తింపు కావడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..