IND vs AUS: విశాఖలో క్రికెట్ సందడి షురూ.. 19న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే.. ఆఫ్‌లైన్ టికెట్ల అమ్మకం ప్రారంభం..
Visakhapatnam: భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రెండో వన్డే విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రెండో వన్డే విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది. దీంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఆఫ్‌లైన్లో టికెట్ల అమ్మకాన్ని ఉదయం నుంచి ప్రారంభించారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, మధురవాడ లోని క్రికెట్ స్టేడియం, గాజువాక లోని రాజీవ్ గాంధీ క్రీడాప్రాంగణాల వద్ద టికెట్ల అమ్మకం కొనసాగుతోంది. అయితే టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఈ మూడు ప్రదేశాల్లోనూ బారులు తీరారు. హైదరాబాద్‌లో గతేడాది జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని బారికేడ్లను ఏర్పాటు చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..