AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Shami : మహమ్మద్ షమీ భార్య వీడియో వైరల్.. కూతురుతో సహా ఆమెపై హత్యాయత్నం కేసు

భారత క్రికెటర్ మహమ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్బూమ్‌లో పొరుగువారితో భూ వివాదం కారణంగా జరిగిన ఘర్షణకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హసిన్ జహాన్ తన పొరుగున ఉన్న మహిళలతో వాగ్వాదానికి, ఘర్షణకు దిగినట్లు కనిపిస్తోంది.

Mohammed Shami : మహమ్మద్ షమీ భార్య వీడియో వైరల్.. కూతురుతో సహా ఆమెపై హత్యాయత్నం కేసు
Hasin Jahan And Arshi
Rakesh
|

Updated on: Jul 17, 2025 | 7:26 PM

Share

Mohammed Shami : భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్బూమ్‌లో పొరుగువారితో జరిగిన ఘర్షణలో ఆమె పాల్గొన్నట్లు చూపే ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కెమెరాలో రికార్డు అవ్వగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హసిన్ జహాన్ తన పొరుగున ఉన్న మహిళలతో తీవ్ర వాగ్వాదానికి, ఘర్షణకు దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనలో ఆమె, ఆమె కుమార్తె అర్షి జహాన్ లపై హత్యాయత్నం కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. హసిన్ జహాన్, ఆమె కుమార్తె అర్షి జహాన్ తమ పొరుగువారితో భూ వివాదం కారణంగా ఘర్షణకు దిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. హసిన్ చట్టవిరుద్ధంగా ఆ భూమిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. పొరుగువారు ఆమెను అడ్డుకోవడంతో వాగ్వాదం పెరిగి, చివరకు అది ఘర్షణగా మారిందని సమాచారం.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ @NCMIndiaa గొడవకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, “మొహమ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్, ఆమె కుమార్తె అర్షి జహాన్ లపై పశ్చిమ బెంగాల్‌లోని బీర్బూమ్ జిల్లా సూరి పట్టణంలో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సూరిలోని వార్డ్ నంబర్ 5లో వివాదాస్పద ప్లాట్‌లో హసిన్ జహాన్ నిర్మాణం ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ఘర్షణ ప్రారంభమైంది. ఆ ప్లాట్ ఆమె కుమార్తె అర్షి జహాన్ పేరు మీద ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాలియా ఖటూన్ నిర్మాణాన్ని ఆపడానికి ప్రయత్నించడంతో హసిన్, ఆమె కుమార్తె దాలియా ఖటూన్‌ను దారుణంగా కొట్టారని ఆరోపణ” అని పేర్కొన్నారు.

ఈ విషయమై హసిన్ జహాన్, ఆమె కుమార్తె అర్షి జహాన్ ఇద్దరిపై కేసు నమోదైంది. హత్యాయత్నం సహా పలు తీవ్రమైన అభియోగాల కింద కేసు నమోదైనట్లు కూడా నివేదికలున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అర్షి జహాన్ హసిన్ జహాన్ మొదటి వివాహం ద్వారా పుట్టిన కుమార్తె. ఆమె మొహమ్మద్ షమీ కుమార్తె కాదు. హసిన్ కొంతకాలంగా తన కుమార్తెలతో కలిసి బీర్బూమ్‌లో నివసిస్తున్నారు. హసిన్ జహాన్‌కు తన భర్త మహమ్మద్ షమీతో చాలా కాలంగా వ్యక్తిగత వివాదాలు ఉన్నాయి. ఇద్దరూ చాలా సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారు. ఇటీవల, కోల్‌కతా హైకోర్టు షమీకి తన భార్య, కుమార్తె ఐరా మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.4 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. భూ వివాదం ఇప్పుడు హసిన్ జహాన్‌కు కొత్త చట్టపరమైన సమస్యలను తెచ్చిపెట్టింది. స్థానిక పోలీసులు తమ దర్యాప్తును ప్రారంభించారు, వైరల్ వీడియోతో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిశీలిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..