వరల్డ్ కప్ 2019: ఫైనల్‌కు అంపైర్లు ఎవరో తెలుసా?
ప్రపంచ కప్ ఫైనల్‌కు టైం దగ్గర పడుతోంది. ఈ నెల 14 న లార్ట్స్ గ్రౌండ్‌లో ట్రోఫీ కోసం ఇంగ్లండ్ – న్యూజిలాండ్‌లు పందెంకోళ్లలా తలపడటానికి సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అంపైర్లను ఐసీసీ ప్రకటించింది. శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన సౌతాఫ్రికాకు చెందిన మారియస్ ఎరాస్మస్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన రాడ్ టక్కర్ ధర్డ్ అంపైర్‌గా… పాకిస్తాన్‌కు చెందిన అలీమ్ ధర్ నాలుగో అంపైర్‌గా వ్యవహరిస్తారని ఐసీసీ […]
ప్రపంచ కప్ ఫైనల్‌కు టైం దగ్గర పడుతోంది. ఈ నెల 14 న లార్ట్స్ గ్రౌండ్‌లో ట్రోఫీ కోసం ఇంగ్లండ్ – న్యూజిలాండ్‌లు పందెంకోళ్లలా తలపడటానికి సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అంపైర్లను ఐసీసీ ప్రకటించింది. శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన సౌతాఫ్రికాకు చెందిన మారియస్ ఎరాస్మస్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన రాడ్ టక్కర్ ధర్డ్ అంపైర్‌గా… పాకిస్తాన్‌కు చెందిన అలీమ్ ధర్ నాలుగో అంపైర్‌గా వ్యవహరిస్తారని ఐసీసీ ప్రకటించింది. శ్రీలంకకే చెందిన రంజన్ మదుగులే మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు. ఫైనల్‌కు ఎనౌన్స్ చేసిన ఈ అంపైర్లందరూ ఇంగ్లండ్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో పనిచేశారు. కాకపోతే కుమార దర్మసేన ఎంపిక చేయడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జేసన్ రాయ్(85).. అంపైర్ ధర్మసేన తప్పుడు నిర్ణయానికి బలైన సంగతి తెలిసిందే. కమిన్స్ బౌలింగ్‌లో బంతి రాయ్ బ్యాట్‌ను తాకకున్నా ఆసీస్ ఆటగాళ్లు అప్పీలు చేయడంతో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్న ధర్మసేన ఔట్ అంటూ వేలు ఎత్తాడు. రిప్లేలో మాత్రం బంతి రాయ్ చేతిని, బ్యాట్‌ను గానీ ఎక్కడా తాకలేదని తేలింది. అప్పటికే సమీక్షలు అయిపోవడంతో అంపైర్ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాయ్ మైదానాన్ని వీడాడు. అయితే మైదానంలో ఈ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ప్రవర్తనకు మాత్రం ఐసీసీ చర్యలు తీసుకుంది. ప్రవర్తనా నియమావళి కింద అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకుగానూ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించడంతో పాటు అతడి ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లు విధించింది.