AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సరిగ్గా 7 ఏళ్ల క్రితం.. వికెట్ల వెనుక ధోని.. హాఫ్ సెంచరీకి చేరువలో బాబర్.. అప్పుడు జరిగింది అద్భుతం!

2019 ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఓ అద్భుత క్షణం. కుల్దీప్ యాదవ్ వేసిన మ్యాజిక్ బాల్‌కు బాబర్ అజమ్ ఔట్ అవ్వగా, ధోని సైతం సంతోషంతో ఎగిరిగంతేశాడు. రోహిత్ శర్మ 140 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మరపురాని మ్యాచ్ విశేషాలు మీ కోసం.

Video: సరిగ్గా 7 ఏళ్ల క్రితం.. వికెట్ల వెనుక ధోని.. హాఫ్ సెంచరీకి చేరువలో బాబర్.. అప్పుడు జరిగింది అద్భుతం!
Kuldeep Yada And Babar Azam
SN Pasha
|

Updated on: Jun 16, 2026 | 4:33 PM

Share

ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక మూల క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. పాత రికార్డులు చెరిగిపోతూ.. కొత్త రికార్డులు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆటగాళ్లు రిటైర్ అయిపోతారు.. కొత్త ప్లేయర్లు వచ్చేస్తుంటారు. ఎన్ని మారినా, కొన్ని మూమెంట్స్ మాత్రం ఎప్పటికీ క్రికెట్ అభిమానుల్లో హృదయాల్లో లైవ్ అవుతూనే ఉంటాయి. అలాంటి అనేక అద్భుతమైన మూమెంట్స్‌లో ఇప్పుడు ఒక దానికి గురించి మాట్లాడుకుందాం..

అనగనగా అదో వరల్డ్ కప్ మ్యాచ్..

సరిగ్గా 7 సంవత్సరాల క్రితం.. అది వన్డే వరల్డ్ కప్ మ్యాచ్. పైగా ఆడుతోంది ఇండియా, పాకిస్థాన్. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా తిరుగులేని శక్తిగా కనిపిస్తోంది. కానీ పాక్ ఆటగాళ్లు కూడా పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే అప్పుడు పీక్ ఫామ్‌లో ఉన్న బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. మరో రెండు పరుగులు చేస్తే.. వరల్డ్ కప్‌లో టీమిండియాపై హాఫ్ సెంచరీ కొట్టిన ఘనతను అందుకున్నాడు. అలాంటి టైమ్‌లో ఓ బాల్ పడుతుంది.. అబ్బా.. అబ్బా.. ఎంత మెచ్చుకున్నా తక్కువే ఆ బాల్. ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే డెలవరీ అది.

కుల్దీప్ ఎగరేశాడు.. ధోని ఎరిగిగంతేశాడు..

అద్భుతమైన ఆ బాల్‌కు బాబర్ ఆజమ్ బెయిల్స్ ఎగిరిపోయాయి. స్టేడియమంతా హోరెత్తి పోయింది. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా కొద్ది సేపు బాబర్ ఆజమ్‌కు అర్థం కాలేదు. మతిపోయింది పాపం అతనికి. ధోని గురించి తెలిసిందేగా.. మిస్టర్ కూల్ అనే పేరుంది. అప్పటికే ఎన్నో మ్యాచ్‌లు ఆడేసి, ఎన్నో విజయాలు చూసేసి ఉన్నోడు.. అలాంటి ధోని కూడా ఆ బాల్‌కు సంతోషం పట్టలేక చిన్నపిల్లాడిలా ఎగిరి గంతేశాడు. అంత అద్భుతమైన డెలవరీ అది. ప్రపంచ క్రికెట్ ఆ బాల్‌ను చూసి నివ్వెరిపోయింది. అంతటి అద్బుతమైన బాల్ వేసింది ఎవరో తెలుసా.. ఇంకెవరు మన చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్. ఆ డ్రీమ్ డెలవరీ‌తో ప్రపంచ క్రికెట్‌లో కుల్దీప్ పేరు మారుమోగిపోయింది.

వీడియో చూడండి

హిట్ మ్యాన్ మాస్ కొట్టుడు..

మొత్తంగా.. 2019 వన్డే వరల్డ్ కప్‌‌లో భారత్, పాకిస్థాన్ మధ్య సరిగ్గా ఇదే రోజు జూన్ 16న జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసి 336 పరుగుల భారీ స్కోర్ చేసింది. హిట్ మ్యాచ్ రోహిత్ శర్మ 140 పరుగులతో చెలరేగిపోయాడు. అలాగే కెప్టెన్ కోహ్లీ 77, కేఎల్ రాహుల్ 57 పరుగులతో రాణించారు. పాపం పాకిస్థాన్.. కేవలం 212 పరుగులకే పరిమితం అయింది. బాబర్ ఆజమ్ 48 పరుగులు చేసి కుల్దీప్ మ్యాజిక్‌కు బలైయ్యాడు.

FAQs

ప్రశ్న: 2019 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఎవరు?

జవాబు: సర్ఫరాజ్ అహ్మద్

ప్రశ్న: 2019 వన్డే వరల్డ్ కప్.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు?

జవాబు: రోహిత్ శర్మ

ప్రశ్న: 2019 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఎన్ని రన్స్ చేశాడు?

జవాబు: 648

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us