AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emergency Fund: మీ వద్ద ఎమర్జెన్సీ ఫండ్ లేదా? ఈ 3 చిట్కాలతో ఆర్థిక భద్రత మీ సొంతం!

Emergency Fund: ఒక అత్యవసర పరిస్థితి రాకముందే మన ఆర్థిక స్థితిస్థాపకత ప్రారంభమవుతుంది. కాలక్రమేణా మనం తీసుకునే చిన్న చిన్న, సరైన నిర్ణయాలే ఒక సంక్షోభం నుంచి బయటపడటానికి, సుదీర్ఘమైన ఆర్థిక ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి మధ్య తేడాను చూపుతాయని ఆయన..

Emergency Fund: మీ వద్ద ఎమర్జెన్సీ ఫండ్ లేదా? ఈ 3 చిట్కాలతో ఆర్థిక భద్రత మీ సొంతం!
Personal Finance
Subhash Goud
|

Updated on: Jul 28, 2026 | 11:08 AM

Share

Emergency Fund: అకస్మాత్తుగా వచ్చే వైద్య అత్యవసర పరిస్థితి (Medical Emergency), ఊహించని ఉద్యోగం కోల్పోవడం, రోడ్డు ప్రమాదం లేదా హఠాత్తుగా ఇంట్లో ఎదురయ్యే కుటుంబ బాధ్యతలు, ఇతర ఆర్థికపరమైన సమస్యలు ఎన్నో ఎదురవుతుంటాయి. అవి ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితిని రాత్రికి రాత్రే తీవ్రంగా దెబ్బతీస్తాయి. కనీసం తేరుకునే సమయం కూడా ఇవ్వవు. ఇలాంటి ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు మనిషి జీవితమై తలకిందులైపోతుంటుంది. అలాంటి సమయంలో ఆర్థికంగా బలంగా ఉండేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని అనుసరించినట్లయితే ఇలాంటి అనుకోని సమస్యలు తలెత్తినప్పుడు ధైర్యంగా ముందుకు సాగిపోవచ్చంటున్నారు నిపుణులు. భారతీయులలో చాలామంది పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించాలని కోరుకుంటారు. అయితే, నిజమైన ఆర్థిక భద్రత అనేది అనుకోకుండా వచ్చే ముప్పులను ఎదుర్కొనేందుకు సద్ధంగా ఉండటంతోనే ప్రారంభమవుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

ఇది కూడా చదవండి: Petrol Price: లీటర్‌ పెట్రోల్‌ రూ.167.. లాభాలు తెలిస్తే ఇదే కొట్టిస్తారు..!

ట్రోవిటీ, మ్యాడ్ ఓవర్ ఇన్సూరెన్స్ సహ-వ్యవస్థాపకుడు రామ్ పాత్రుడు ప్రకారం.. ఆర్థిక సిద్ధత అనేది ఎక్కువ జీతం సంపాదించడంపై ఆధారపడి ఉండదు. సంక్షోభం రాకముందే సరైన రక్షణ చర్యలు తీసుకోవడంలోనే ఉంటుంది. అత్యవసర పరిస్థితులు మనకు సిద్ధపడటానికి సమయాన్ని ఇస్తాయని చాలామంది భావిస్తారు. కానీ అవి ఇవ్వవు. ఆర్థిక రక్షణను ఏర్పాటు చేసుకోకుండా నేరుగా సంపద సృష్టిపై దృష్టి పెట్టడమే చాలా కుటుంబాలు చేసే అతిపెద్ద పొరపాటు అని రామ్ పాత్రుడు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సర్వేలు, పలు రంగాల నివేదికల ప్రకారం.. నేటికీ భారతదేశంలో చాలా కుటుంబాల పొదుపుపై ఒత్తిడి కొనసాగుతోంది. ఆదాయం హఠాత్తుగా ఆగిపోతే, కనీసం కొన్ని నెలల నిత్యవసర ఖర్చులను కూడా తట్టుకోలేని పరిస్థితిలో భారీ సంఖ్యలో కుటుంబాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి ఆయన సూచిస్తున్న 3 ముఖ్యమైన దశలు:

1. ముందుగా ‘సర్వైవల్ ఫండ్’ ఏర్పాటు చేసుకోండి: మొదటి అడుగు ఎమర్జెన్సీ ఫండ్‌ను నిర్మించడం. పెట్టుబడుల ద్వారా ఎక్కువ రాబడులు సాధించాలని చూసే ముందు, ప్రతి కుటుంబం తమ కనీసం 3 నుండి 6 నెలల అత్యవసర ఖర్చులకు సరిపడా సర్వైవల్ ఫండ్‌ను సిద్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ నిధిని ఒక్కరోజులోనే సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా కొద్దిమొత్తంలో అయినా క్రమం తప్పకుండా పొదుపు చేయాలి. ఈ ఫండ్ ఉద్దేశం అధిక రాబడులు పొందడం కాదు, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు డబ్బు తక్షణమే చేతికి అందుబాటులో ఉండటమే.

2. బీమాతో ఆర్థిక నష్టాల నుంచి రక్షణ పొందండి: రెండవ అడుగు ఏళ్ల తరబడి కూడబెట్టిన పొదుపును ఒక్కసారిగా తుడిచిపెట్టే ప్రమాదాల నుండి రక్షణ పొందడం. ఒక్కసారి ఆసుపత్రిలో చేరడం లేదా ఒక పెద్ద ప్రమాదం జరగడం వల్ల ఒక కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటుంది. తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ (ఆరోగ్య బీమా), సంపాదించే సభ్యులకు అనువైన లైఫ్ ఇన్సూరెన్స్ (జీవిత బీమా), వైకల్య రక్షణ పొందడం అనేది అనవసర ఖర్చు కాదు. అవన్నీ ఒక బలమైన ఆర్థిక రక్షణ కవచాలు అని పాత్రుడు అన్నారు. ఆర్థిక ప్రణాళిక అంటే కేవలం సంపదను పెంచుకోవడమే కాదు, కుటుంబం సొంతంగా తట్టుకోలేని నష్టాలను నివారించడం కూడా అని ఆయన వివరించారు.

3. మీ ఆర్థిక వివరాలను స్పష్టంగా, క్రమబద్ధంగా ఉంచుకోండి: మీ ఆర్థిక పరిస్థితిపై మీకు పూర్తి స్పష్టత ఉండటం. చాలామందికి రకరకాల బ్యాంక్ ఖాతాలు, ఇన్సూరెన్సులు, డిపాజిట్లు ఉంటాయి. కానీ తమ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ అయి ఉంది. అసలు ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందో స్పష్టమైన అవగాహన ఉండదు. అందుకే బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, ఇన్సూరెన్స్ పాలసీలు, రుణాలు (Loans), నామినీలు, ముఖ్యమైన పత్రాల వివరాలను ఒకేచోట స్పష్టంగా నమోదు చేసి ఉంచుకోవాలని పాత్రుడు రికమండ్ చేస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా సమీక్షించుకోవడం ద్వారా లేని కవరేజీలను గుర్తించడం, నామినీలను అప్‌డేట్ చేయడం లేదా అనవసరమైన డూప్లికేషన్లను తొలగించడం సులువవుతుంది.

ఒక అత్యవసర పరిస్థితి రాకముందే మన ఆర్థిక స్థితిస్థాపకత ప్రారంభమవుతుంది. కాలక్రమేణా మనం తీసుకునే చిన్న చిన్న, సరైన నిర్ణయాలే ఒక సంక్షోభం నుంచి బయటపడటానికి, సుదీర్ఘమైన ఆర్థిక ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి మధ్య తేడాను చూపుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Premium Petrol: ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్నారా? కేంద్రం కీలక ప్రకటన..!

ఇది కూడా చదవండి: Success Story: TCS ఉద్యోగాన్ని కాదని.. రూ. 35 ల బియ్యం వ్యాపారంతో ఏటా రూ. 25 లక్షల సంపాదన!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us