Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poor Cricketers: సేల్స్‌మెన్ నుంచి లారీ డ్రైవర్ వరకు.. రిటైర్మెంట్ తర్వాత నిరుపేదలుగా మారిన ముగ్గురు క్రికెటర్లు..

Most Poor Cricketers List: క్రికెటర్లు తమ ఆట ఆధారంగా సంపద, పేరు, హోదా, గుర్తింపును సంపాదించారు. నేటి కాలంలో, ప్రతి ఒక్కరూ క్రికెట్‌ను ఇష్టపడుతంటారు. ప్రతి ఒక్కరూ ఈ ఆటపై ఆసక్తి చూపుతున్నారు. నేడు క్రికెట్ అనేది ప్రతి ఒక్కరికీ ఇష్టమైన క్రీడలలో ఒకటిగా మారింది. అదే సమయంలో, చిన్న గ్రామాలు, నగరాల నుంచి వచ్చిన క్రికెటర్లు నేడు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నారు.

Poor Cricketers: సేల్స్‌మెన్ నుంచి లారీ డ్రైవర్ వరకు.. రిటైర్మెంట్ తర్వాత నిరుపేదలుగా మారిన ముగ్గురు క్రికెటర్లు..
Most Poor Cricketers
Follow us
Venkata Chari

|

Updated on: Aug 27, 2024 | 4:57 PM

Most Poor Cricketers List: క్రికెటర్లు తమ ఆట ఆధారంగా సంపద, పేరు, హోదా, గుర్తింపును సంపాదించారు. నేటి కాలంలో, ప్రతి ఒక్కరూ క్రికెట్‌ను ఇష్టపడుతంటారు. ప్రతి ఒక్కరూ ఈ ఆటపై ఆసక్తి చూపుతున్నారు. నేడు క్రికెట్ అనేది ప్రతి ఒక్కరికీ ఇష్టమైన క్రీడలలో ఒకటిగా మారింది. అదే సమయంలో, చిన్న గ్రామాలు, నగరాల నుంచి వచ్చిన క్రికెటర్లు నేడు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నారు. చిన్నతనంలో పేదరికం చూసి కష్టాలు పడ్డా నేడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

తమ ఆటతీరుతో క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకున్న కొందరు క్రికెటర్లు ఉన్నారు. అంటే, కొంతమంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత తమ ఖర్చులను భరించడం కష్టంగా ఉండేది. ప్రపంచంలో ముగ్గురు పేద క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

3. సేల్స్‌మెన్‌గా పనిచేస్తోన్న మాథ్యూ సింక్లైర్..

మాథ్యూ సింక్లైర్ ఆస్ట్రేలియాలో జన్మించాడు. అతను న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. న్యూజిలాండ్ ఆటగాడు మాథ్యూ సింక్లెయిర్ అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించాడు. తన క్రికెట్ కెరీర్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే, 2013లో క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత అతని ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అతను తన ఇంటి ఖర్చులకు నేపియర్‌లో సేల్స్‌మెన్‌గా కూడా పనిచేస్తున్నాడు.

2. టాక్సీ నడుపుతోన్న అర్షద్ ఖాన్..

ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్పిన్నర్లలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అర్షద్ ఖాన్ ఒకడిగా. అతను చాలా సంవత్సరాలు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అర్షద్ ఖాన్ 1993లో తొలిసారి పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆడాడు. అదే 2006లో క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. పదవీ విరమణ తర్వాత, అతని ఆర్థిక పరిస్థితి గణనీయంగా క్షీణించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి టాక్సీ నడపడం మొదలుపెట్టాడు.

1. లారీ డ్రైవర్‌గా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ క్రిస్ క్రేన్స్..

క్రిస్ క్రేన్స్ అతని సమయంలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడు. న్యూజిలాండ్‌ను చాలా మ్యాచ్‌ల్లో విజయతీరాలకు చేర్చాడు. క్రిస్ క్రేన్స్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత డైమండ్ బిజినెస్ చేశాడు. ఇందులో అతను చాలా నష్టపోయాడు. దాని కారణంగా అతను కూడా అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత వజ్రాల వ్యాపారాన్ని మూసివేసి కుటుంబ పోషణ కోసం లారీ డ్రైవర్‌గా పని చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..