AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: జింబాబ్వే పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టుతో టీమిండియా.. సారథ్య బాధ్యతలు ఎవరికంటే?

KL Rahul: విండీస్‌తో సిరీస్‌ అనంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు ఆడనుంది. ఆగస్ట్ 18న హరారే వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

IND vs ZIM: జింబాబ్వే పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టుతో టీమిండియా.. సారథ్య బాధ్యతలు ఎవరికంటే?
Team India
Basha Shek
|

Updated on: Jul 21, 2022 | 11:43 AM

Share

KL Rahul: ఇంగ్లండ్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న టీమిండియా నేరుగా కరేబియన్ ఫ్లైట్‌ ఎక్కింది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు విండీస్‌తో మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. కెప్టెన్‌ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు విండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్నారు. దీంతో శిఖర్‌ ధావన్‌ ఈ సిరీస్‌లో సీనియర్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ టీమిండియాను నడిపించనున్నాడు. అయితే విండీస్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లి, బుమ్రా మినహా మిగతా ఆటగాళ్లంతా తిరిగి జట్టులో చేరునున్నారు. కాగా టూర్‌లో భాగంగా రేపు ఇండియా, విండీస్‌ల మధ్య మొదటి వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఇక విండీస్‌తో సిరీస్‌ అనంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు ఆడనుంది. ఆగస్ట్ 18న హరారే వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by SportsTiger (@sportstiger_official)

కాగా ఆగస్ట్ 27 నుంచి ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. దీంతో జింబాబ్వే పర్యటనకు భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రోహిత్‌ శర్మతో సీనియర్‌ ఆటగాళ్లందరికీ విశ్రాంతి కల్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే పర్యటనకు టీమిండియా సారథిగా కేఎల్‌ రాహుల్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా గాయం కారణంగా చాలా కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు రాహుల్‌. అయితే విండీస్‌తో టీ20 సిరీస్‌తో అతను తిరిగి జట్టులో చేరనున్నాడు. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. కాగా రాహుల్‌ పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే విండీస్‌ టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by KL Rahul? (@klrahul)

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..