AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 KKR : కోల్‌కతా నైట్ రైడర్స్ క్యాంప్‌లో రూ.18కోట్ల టెన్షన్.. పతిరానా రాకపై వీడని సస్పెన్స్

IPL 2026 KKR : మతీషా పతిరానా ఐపీఎల్ 2026లో కేకేఆర్ తరపున ఆడేందుకు ఇంకా ఎన్‌ఓసీ రాలేదు. ఫిట్‌నెస్ పరీక్షల ఆలస్యం కారణంగా ఈ శ్రీలంక పేసర్ జట్టుతో చేరడం ఆలస్యమవుతోంది. ఈ సీజన్ వేలంలో కేకేఆర్ అత్యంత ఖరీదైన ధరకు పతిరానాను దక్కించుకుంది.

IPL 2026 KKR  : కోల్‌కతా నైట్ రైడర్స్ క్యాంప్‌లో రూ.18కోట్ల టెన్షన్.. పతిరానా రాకపై వీడని సస్పెన్స్
Matheesha Pathirana
Rakesh
|

Updated on: Apr 07, 2026 | 12:48 PM

Share

IPL 2026 KKR : ఐపీఎల్ 2026 సీజన్ మొదలైందో లేదో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టుకు ఇప్పుడు బౌలింగ్ విభాగంలో ఊహించని దెబ్బ తగిలింది. రూ.18 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరానా ఇంకా జట్టుతో చేరకపోవడం కేకేఆర్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) నుంచి అతనికి ఇంకా క్లియరెన్స్ లభించకపోవడమే దీనికి ప్రధాన కారణం.

ఈ సీజన్ వేలంలో కేకేఆర్ అత్యంత ఖరీదైన ధరకు పతిరానాను దక్కించుకుంది. అయితే జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో పతిరానా అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ఇప్పటికే భారత ఫాస్ట్ బౌలర్లు హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ గాయాల కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో బ్లెస్సింగ్ ముజారబానీ వచ్చినా, డెత్ ఓవర్లలో పతిరానా ఇచ్చే పట్టుత్వం కేకేఆర్ కు ప్రస్తుతం దొరకడం లేదు. పతిరానా రాక ఆలస్యమైతే కేకేఆర్ బౌలింగ్ యూనిట్ మరింత బలహీనపడే అవకాశం ఉంది.

శ్రీలంక క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం.. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరూ తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్షలు పాస్ కావాలి. పతిరానాతో పాటు మరో 15 మంది లంక ఆటగాళ్లు ఇంకా ఈ పరీక్షలు పూర్తి చేయలేదు. ఈ ఏడాది మొదట్లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పతిరానాకు కాలి కండరాల గాయం అయింది. ప్రస్తుతం అతను కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, బోర్డు నిర్వహించే అధికారిక ఫిట్‌నెస్ టెస్టులో నెగ్గితేనే అతనికి ఎన్‌ఓసీ లభిస్తుంది. ఈ పరీక్షలు వచ్చే వారం జరిగే అవకాశం ఉంది.

తాజా సమాచారం ప్రకారం.. పతిరానా ఏప్రిల్ మధ్య నాటికి కేకేఆర్ జట్టుతో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ఈ నెలాఖరులో జరిగే మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండొచ్చు. కానీ అప్పటి వరకు కేకేఆర్ తనకున్న పరిమిత వనరులతోనే నెట్టుకురావాల్సి ఉంటుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో వెనుకబడిన జట్టుకు పతిరానా యార్కర్లు ఎంత త్వరగా తోడైతే అంత మంచిది. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున అదరగొట్టిన పతిరానా, ఇప్పుడు కేకేఆర్ తరపున తన విలువను నిరూపించుకోవాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us