KKR vs RCB Match Postponed: కరోనా ఎఫెక్ట్.. ఈరోజు జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ వాయిదా!

IPL 2021 Today's Match: క్రికెట్ ప్రేమికులను ఒక ఊపు ఊపేస్తున్న ఐపీఎల్ 2021 పై దెబ్బ పడినట్టు తెలుస్తోంది. ఈరోజు (మే3) జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది.

  • Publish Date - 12:42 pm, Mon, 3 May 21
KKR vs RCB Match Postponed: కరోనా ఎఫెక్ట్.. ఈరోజు జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ వాయిదా!
Kkr Vs Rcb

KKR vs RCB Match Postponed: క్రికెట్ ప్రేమికులను ఒక ఊపు ఊపేస్తున్న ఐపీఎల్ 2021 పై దెబ్బ పడినట్టు తెలుస్తోంది. ఈరోజు (మే3) జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది. క్రిక్‌బజ్ అంచనా ప్రకారం ఐపీఎల్ 2021లో ఈరోజు జరగాల్సిన 30వ మ్యాచ్ జరిగే అవకాశం కనిపించడం లేదు. కోవిడ్ కారణంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) ఈ మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేసె యోచనలో ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు ఈరోజు మ్యాచ్ జరగాల్సిన అహ్మదాబాద్ కు మెసేజ్ వెళ్ళినట్టుగా క్రిక్‌బజ్ కు సమాచారం అందినట్టు చెబుతోంది. స్థానిక గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేస్తున్నట్టు క్రిక్‌బజ్ చెబుతోంది. అకస్మాత్తుగా మ్యాచ్ వాయిదా వేయడానికి గల కారణాలు అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ, విశ్వసనీయ సమాచారం ప్రకారం కేకేఆర్ శిబిరంలో ఒక ఆటగాడికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది.

ఇక విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడు మ్యాచ్ లలో 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడవ స్థానంలో నిలిచింది.

Also Read: డేంజర్ బ్యాట్స్‌మెన్..? డ్రెస్సింగ్ రూంలో ఏమంటున్నాడో తెలుసా..! వైరల్ అవుతున్న వీడియో..!

కేఎల్ రాహుల్‌కి అపెండిసైటిస్..! ఆపరేషన్ కోసం ఆస్పత్రికి.. మరి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఎవరో తెలుసా..?