AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేంజర్ బ్యాట్స్‌మెన్..? డ్రెస్సింగ్ రూంలో ఏమంటున్నాడో తెలుసా..! వైరల్ అవుతున్న వీడియో..!

IPL 2021: ఐపీఎల్ అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లో.. ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.

డేంజర్ బ్యాట్స్‌మెన్..? డ్రెస్సింగ్ రూంలో ఏమంటున్నాడో తెలుసా..! వైరల్ అవుతున్న వీడియో..!
Keiron Pollard
uppula Raju
|

Updated on: May 02, 2021 | 8:43 PM

Share

IPL 2021: ఐపీఎల్ అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లో.. ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఇరువైపుల నుంచి బ్యాట్స్‌మెన్ మెరుపు బ్యాటింగ్ చేశారు. రెండు వైపుల నుంచి బ్యాట్స్ మెన్ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఏదేమైనా కీరోన్ పొలార్డ్ ఒక్కసారిగా మ్యాచ్ రూపు రేఖలు మార్చేసాడు. ధోని జట్టును ఓడించడమే కాకుండా ఇతర జట్లకు హెచ్చరికలు జారీ చేశాడు.

ఢిల్లీలో జరగిన ఈ మ్యాచ్‌లో సిఎస్‌కె మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. డుప్లెసిస్, మొయిన్ అలీ హాఫ్ సెంచరీలతో పాటు, అంబటి రాయుడు కేవలం 27 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ 200 ప్లస్ లక్ష్యాన్ని ఎప్పుడూ అధిగమించలేదు. దీంతో ఓడిపోతామని నిర్ణయించుకుంది. రోహిత్, సూర్యకుమార్, డీకాక్ వెంట వెంటనే ఔటైనా కైర్న్ పొలార్డ్ మాత్రం గెలుపు ఆశతో ఉన్నాడు. మెరుపు బ్యాటింగ్‌తో ముంబైకి విజయం అందించాడు.

పొలార్డ్ కేవలం 34 బంతుల్లో 8 సిక్సర్లు, 6 ఫోర్లు సాయంతో అజేయంగా 87 పరుగులు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. ఈ రన్ చేజ్ చూసిన తరువాత రోహిత్ శర్మ కూడా ఆశ్చర్యపోయాడు. రోహిత్ గతంలో ఎప్పుడు ఇలాంటి రన్‌చేస్‌ను చూడలేదు. ధోని సూపర్ కింగ్స్‌ను ఓడించిన తర్వాత సూపర్ హీరోగా మారిన కైరాన్ పొలార్డ్ వీడియో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికొచ్చింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో పొలార్డ్ మిగతా జట్లను ఒక విధంగా హెచ్చరిస్తున్నాడు. సిఎస్‌కెను ఓడించిన తరువాత ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌ల్లో నాల్గవ విజయాన్ని నమోదు చేసింది పాయింట్ల సంఖ్యలో నాల్గవ స్థానంలో ఉన్నారు.

West Bengal, Assam Election Results 2021 LIVE: నందిగ్రామ్‌లో అనూహ్య మలుపు.. మమత VS సుభేందు ఎవరు గెలిచారు?..

Cyber Attack: కొరియ‌ర్ సంస్థ పేరుతో ట్రాకింగ్ మెసేజ్‌.. క్లిక్ చేసే ఖేల్ ఖ‌తం.. ముందే జాగ్ర‌త్త ప‌డండి..