MI vs KKR Highlights, IPL 2022: కమిన్స్ తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబైపై కోల్‌కతా ఘన విజయం..

Venkata Chari

| Edited By: Basha Shek

Updated on: Apr 07, 2022 | 12:50 AM

MI vs KKR Highlights in Telugu: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 162 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

MI vs KKR Highlights, IPL 2022: కమిన్స్ తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబైపై కోల్‌కతా ఘన విజయం..
Mi Vs Kkr Live Score, Ipl 2022

MI vs KKR, IPL 2022: ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్‌ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ప్యాట్‌ కమిన్స్‌ రెచ్చిపోయాడు. ముంబైతో మ్యాచ్‌ లో మొదట బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన ఈ స్టార్‌ క్రికెటర్‌ ఆ తర్వాత బ్యాటింగ్‌ లోనూ విధ్వంసం సృష్టించాడు. కేవలం 15 బంతుల్లోనే 56 పరుగులు చేసి కోల్‌కతాకు మూడో విజయాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 4 ఫోర్లు, 6 సిక్స్‌ లు ఉండడం విశేషం. కమిన్స్ కు తోడు ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (50) అర్ధ సెంచరీతో రాణించడంతో కోల్‌కతా జట్టు 4 ఓవర్లు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో ముంబై పై విజయం సాధించింది. అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 162 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ముంబై ఇండియన్స్ తరపున సూర్యకుమార్ యాదవ్ 52(36 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్సులు) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత తిలక్ వర్మ 38(27 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు), బ్రీవిస్ 29(19 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు), కీరన్ పొలార్డ్ 22(5 బంతులు, 3 సిక్సులు)లతో ఆకట్టుకున్నారు. ఇక రోహిత్ శర్మ 3, ఇషాన్ కిషన్ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరి, తీవ్రంగా నిరాశ పరిచారు. కోల్‌కతా బౌలర్లలో పాట్ కమిన్స్ 2, ఉమేష్ యాదవ్, చక్రవర్తి తలో వికెట్ పడట్టారు.

ఇరు జట్లు:

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(కీపర్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి

Key Events

ముంబై ఇండియన్స్ ఖాతా తెరిచేనా..

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఆడిన రెండింటిలోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మరో విజయంపై కన్నేసిన కోల్‌కతా..

ఈ సీజన్‌లో కోల్‌కతా అత్యుత్తమ ఆటతో సత్తా చాటుతోంది. మూడు మ్యాచ్‌లు ఆడి, రెండింట్లో విజయం సాధించింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 06 Apr 2022 10:54 PM (IST)

    ప్యాట్ కమిన్స్ విధ్వంసం.. ముంబైపై కోల్‌కతా ఘన విజయం..

    ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్‌ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ప్యాట్‌ కమిన్స్‌ రెచ్చిపోయాడు. ముంబైతో మ్యాచ్‌ లో మొదట బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన ఈ స్టార్‌ క్రికెటర్‌ ఆ తర్వాత బ్యాటింగ్‌ లోనూ విధ్వంసం సృష్టించాడు. కేవలం 15 బంతుల్లోనే 56 పరుగులు చేసి కోల్‌కతాకు మూడో విజయాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 4 ఫోర్లు, 6 సిక్స్‌ లు ఉండడం విశేషం. కమిన్స్ కు తోడు ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (50) అర్ధ సెంచరీతో రాణించడంతో కోల్‌కతా జట్టు 4 ఓవర్లు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో ముంబై పై విజయం సాధించింది

  • 06 Apr 2022 10:42 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌..

    కోల్ కతా ఐదో వికెట్‌ కోల్పోయింది. ఫోర్‌, సిక్సర్‌ కొట్టి ఊపుమీదున్న డ్యాషింగ్‌ బ్యాటర్‌ ఆండ్రీ రస్సెల్‌ (11) ఔటయ్యాడు. మిల్స్‌ బౌలింగ్‌లో భారీషాట్కు యత్నించి బ్రెవిస్‌కు చిక్కాడు. మరోవైపు ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌(460 నిలకడగా ఆడుతున్నాడు. ఆజట్టు విజయానికి 40 బంతుల్లో 60 పరుగులు అవసరం.

  • 06 Apr 2022 10:34 PM (IST)

    కోల్ కతాను మళ్లీ దెబ్బ కొట్టిన మురుగన్‌.. నితీశ్‌ రాణా ఔట్‌..

    ముంబై స్పి్న్నర్‌ మురుగన్‌ అశ్విన్‌ కోల్‌కతాను మళ్లీ దెబ్బకొట్టాడు. సిక్స్‌ కొట్టి ఊపుమీదున్న నితీశ్‌రాణా (8)ను పెవిలియన్‌కు పంపించాడు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ స్కోరు 89/4. క్రీజులో వెంకటేశ్‌ అయ్యర్‌ (39), అండ్రీ రస్సెల్‌ (6) ఉన్నారు.

  • 06 Apr 2022 10:25 PM (IST)

    సామ్‌ బిల్లింగ్స్‌ ఔట్‌.. 10 ఓవర్లకు కేకేఆర్‌ స్కోరెంతంటే..

    కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో భారీషాట్‌ కు యత్నించిన సామ్‌ బిల్లింగ్స్‌ (17) ఔటయ్యాడు. ఆ జట్టు విజయానికి ఇంకా 58బంతుల్లో 89 బంతులు అవసరం. క్రీజులో వెంకటేశ్‌ అయ్యర్‌ (37), నితీశ్‌ రాణా (0) ఉన్నారు.

  • 06 Apr 2022 10:04 PM (IST)

    కేకేఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌.. పెవిలియన్‌ చేరిన కెప్టెన్‌ శ్రేయస్‌..

    కోల్‌కతా రెండో వికెట్‌ కోల్పోయింది. డానియల్‌ సామ్స్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (10) పెవిలియన్‌ చేరుకున్నాడు. ప్రస్తుతం కేకేఆర్‌ స్కోరు 6.2 ఓవర్లకు 36/2/ . క్రీజులో సామ్‌ బిల్లింగ్స్‌ (0), వెంకటేశ్‌ అయ్యర్‌ (19) ఉన్నారు.

  • 06 Apr 2022 09:56 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా..

    అజింక్య రహానే(7) రూపంలో కోల్‌కతా టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీం స్కోర్ 16 పరుగుల వద్ద రహానే పెవిలియన్ చేరాడు.

  • 06 Apr 2022 09:51 PM (IST)

    4 ఓవర్లకు స్కోర్..

    4 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్ రైడర్స్ వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. రహానే 7, వెంకటేష్ అయ్యర్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 06 Apr 2022 09:24 PM (IST)

    కోల్‌కతా టార్గెట్ 162

    ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 162 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ముంబై ఇండియన్స్ తరపున సూర్యకుమార్ యాదవ్ 52(36 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్సులు) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

  • 06 Apr 2022 09:02 PM (IST)

    18 ఓవర్లకు స్కోర్..

    18 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. తిలక్ వర్మ 34, సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 06 Apr 2022 08:51 PM (IST)

    16 ఓవర్లకు స్కోర్..

    16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసింది. తిలక్ వర్మ 15, సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 06 Apr 2022 08:34 PM (IST)

    13 ఓవర్లకు స్కోర్..

    13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్లు నష్టపోయి 71 పరుగులు చేసింది. తిలక్ వర్మ 4, సూర్యకుమార్ యాదవ్ 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 06 Apr 2022 08:27 PM (IST)

    మూడో వికెట్ డౌన్..

    ముంబై ఇండియన్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లోకి జారుకుంటుంది. గత రెండు మ్యాచ్‌ల్లో రాణించిన ఇషాన్, ఈ మ్యాచ్‌లో కేవలం 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. కమిన్స్ బౌలింగ్‌లో అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై 55 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఇషాన్ కిషన్ అనుకున్నట్లుగా కేకేఆర్ బౌలర్లకు లొంగిపోయాడు. కమిన్స్ బౌలింగ్‌లో ఇప్పటి వరకు 9 బంతులు ఆడి, 3 సార్లు పెవిలియన్ చేరాడు.

  • 06 Apr 2022 08:13 PM (IST)

    రెండో వికెట్ డౌన్..

    ధాటిగా ఆడుతోన్న బ్రీవిస్‌ను చక్రవర్తి పెవిలియన్ చేర్చాడు. 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో మాంచి ఊపులో కనిపించిన బ్రీవిస్‌ను బిల్లింగ్స్ స్టంపింగ్ చేయడంతో ముంబై 45 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.

  • 06 Apr 2022 07:59 PM (IST)

    6 ఓవర్లకు స్కోర్..

    6 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ ఒక వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. ఇషాన్ శర్మ 10, బ్రీవిస్ 21 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఉమేష్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.

  • 06 Apr 2022 07:46 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన ముంబై.. మళ్లీ నిరాశపర్చిన హిట్‌ మ్యాన్‌..

    ముంబై ఇండియన్స్‌ మొదటి వికెట్ కోల్పోయింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (3) ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం ముంబై స్కోరు 3 ఓవర్లు ముగిసే సరికి 7/1. ఇషాన్‌ కిషన్ (2), డేవాల్డ్‌ బ్రేవిస్‌ (1) క్రీజులో ఉన్నారు.

  • 06 Apr 2022 07:09 PM (IST)

    ముంబై ఇండియన్స్ జట్టు..

    ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి

  • 06 Apr 2022 07:06 PM (IST)

    కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు..

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(కీపర్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి

  • 06 Apr 2022 07:05 PM (IST)

    టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

    టాస్ గెలిచిన కోల్‌కతా టీం బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

  • 06 Apr 2022 06:56 PM (IST)

    ముంబై‌దే ఆధిపత్యం..

    ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల రికార్డులు చూస్తే ముంబైదే పైచేయిగా నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 29 మ్యాచ్‌లు జరగగా, అందులో 22 మ్యాచ్‌లు ముంబై గెలవగా, కోల్‌కతా ఏడు మ్యాచ్‌లు గెలిచింది.

Published On - Apr 06,2022 6:44 PM

Follow us