- Telugu News Photo Gallery Cricket photos ICC ODI Rankings: Pakistan Captain Babar Azam remains number one, Imam and Shaheen gain places virat kohli on 2nd place
ICC ODI Ranking: విరాట్ కోహ్లీకి షాకిచ్చిన పాకిస్తాన్ సారథి.. భారీ తేడాతో అగ్రస్థానంలోకి..
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 2 సెంచరీలు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.
Updated on: Apr 06, 2022 | 5:19 PM

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎలాంటి బౌలర్‌కైనా చెమటలు పట్టిస్తున్నాడు. ఈక్రమంలో బాబర్ నిరంతరం రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ ఈ ప్రదర్శనకు ప్రతిఫలం అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో బాబర్ నంబర్ వన్ స్థానంలో తన పట్టును మరింత పటిష్టం చేసుకున్నాడు.

మార్చి 6, బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో బాబర్ అజామ్ వన్డేల్లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాపై 2 సెంచరీలు చేసిన తర్వాత, బాబర్ రెండవ ర్యాంక్‌లో ఉన్న భారత స్టార్ విరాట్ కోహ్లీపై భారీ ఆధిక్యాన్ని సంపాదించాడు. తాజా ర్యాంకింగ్‌లో బాబర్‌కు 891 రేటింగ్ పాయింట్లు ఉండగా, విరాట్ కోహ్లీకి 811 పాయింట్లు మాత్రమే ఉన్నాయి.

బాబర్ మాత్రమే కాదు, పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సహాయంతో దాదాపు 300 పరుగులు చేశాడు. దీంతో అతను 7 స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు.

బౌలర్ల విషయానికొస్తే.. అందులో పెద్దగా మార్పు లేదు. న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది 8 స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్‌లో భారత్ నుంచి జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఆరో స్థానంలో ఉన్నాడు.




