IPL Retention: ఐపీఎల్ ఆడనంటూ కోల్‌కతాకు షాకిచ్చిన మరో ప్లేయర్.. ఎవరంటే?

| Edited By: Venkata Chari

Nov 15, 2022 | 2:26 PM

భారత్ కేంద్రంగా జరిగే ఐపీఎల్‌లో ఆడేందుకు దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఎంతగానో ఆసక్తి చూపుతారు అంటే అతిశయోక్తి కానే కాదు. అయితే ఇలాంటి ఖరీదైన..

IPL Retention: ఐపీఎల్ ఆడనంటూ కోల్‌కతాకు షాకిచ్చిన మరో ప్లేయర్.. ఎవరంటే?
Kkr Team Players
Follow us on

ప్రపంచంలోనే ‘అత్యంత ఖరీదైన టోర్నమెంట్’ అని భారత్‌తో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు పేరు ఉంది. ఈ లీగ్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా మంచి పేరు ఉంది. భారత్ కేంద్రంగా జరిగే ఐపీఎల్‌లో ఆడేందుకు దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఎంతగానో ఆసక్తి చూపుతారు అంటే అతిశయోక్తి కానే కాదు. అయితే ఇలాంటి ఖరీదైన ఐపీఎల్ 2023 టోర్నమెంట్‌కు తాను అందుబాటులో ఉండలేనని, అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అస్ర్తేలియా ఆటగాడు ప్రకటించాడు. రానున్న యాషెస్ సిరీస్, ప్రపంచకప్ కోసం తనకు కొంత విశ్రాంతి అవసరమని తెలిపాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించే పాట్ కమ్మిన్స్ ఐపీఎల్‌ 2023 లో జరగబోయే 16వ ఎడిషన్‌ నుంచి వైదొలగుతున్నట్లు మంగళవారం ట్వీట్ చేశాడు. అస్ట్రేలియా జట్టుకు టెస్ట్ మరియు వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పాట్ కమ్మిన్స్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ తరఫున చివరి మూడు ఐపీఎల్ టోర్నమెంట్‌లను ఆడాడు. అయితే ఐపీఎల్ 2022 అతని తుంటి గాయం కావడంతో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆడిన ఆ 5 మ్యాచ్‌లలోనే అతను 7 వికెట్లు తీయడంతో పాటు 53 పరుగులు చేశాడు.

“వచ్చే సంవత్సరం జరగబోయే ఐపీఎల్ నుంచి వైదొలగాలని నేను నిర్ణయించుకున్నాను. వచ్చే ఏడాది నా షెడ్యుల్ అంతా టెస్ట్‌ మరియు వన్డే సిరీస్‌లతోనే నిండి ఉంది. ఇంకా ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్, భారత్‌లో జరిగే వన్డే ప్రపంచ కప్‌కు ముందు నాకు కొంత విశ్రాంతి కావాలి. నా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు కోల్‌కతా టీమ్ యాజమాన్యానికి ధన్యవాదాలు. క్రమశిక్షణ కలిగిన ఆటగాళ్లతో కూడిన అద్భుతమైన జట్టు అది. నేను వీలైనంత త్వరగా జట్టులో భాగం కావాలని కోరుకుంటున్నాన”ని పాట్ కమ్మిన్స్ ట్వీట్ చేశాడు. కమ్మిన్స్ ఇటీవల అతని సొంతగడ్డపై జరిగిన T20 ప్రపంచ కప్‌లో మెరుగ్గా ఆడలేక అందరినీ నిరాశపరిచాడు.

ఇవి కూడా చదవండి


డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు ముందే వెనుదిరగడంతో.. అతను నాలుగు మ్యాచ్‌లలో 44.00 సగటుతో మూడు వికెట్లు మాత్రమే తీశాడు. కాగా, ఐపీఎల్ 2023లో జరగబోయే 16వ సీజన్ కోసం రిటెన్షన్ జాబితాను ప్రకటించడానికి నవంబర్ 15 చివరి రోజు కావడంతో..అందుకు ముందుగానే పాట్ కమ్మిన్స్ తన నిర్ణయాన్ని తెలియపరిచాడు. కమ్మిన్స్ కంటే ముందు ఇంగ్లాండు ఆటగాడు సామ్ బిల్లింగ్స్ కూడా ఐపీఎల్‌కు అందుబాటులో ఉండలేనని ప్రకటించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..