భారత్‌లో జరగబోయేది వరల్డ్ కప్ కాదు.. వరల్డ్ టెర్రరిస్ట్ కప్.. ఖలిస్తానీ ఉగ్రవాదుల బెదిరింపులతో టెన్షన్..
ICC World Cup 2023: గత కొద్ది రోజులుగా ఖలిస్తాన్ విషయంలో భారత్, కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత ప్రభుత్వం తన ఏజెంట్ల ద్వారా చంపిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. కానీ, భారత ప్రభుత్వం ఈ ఆరోపణను తిరస్కరించింది. నిజ్ర్ ఖలిస్తానీ ఉగ్రవాది అని పేర్కొంటూ కెనడాకు తగిన సమాధానం ఇచ్చింది. కాగా, కెనడాలో ఏర్పడిన 'సిఖ్ ఫర్ జస్టిస్' పేరుతో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారత్‌ను నిత్యం బెదిరిస్తూనే ఉన్నాడు.

ICC World Cup 2023: 13వ వన్డే ప్రపంచకప్ (ICC world cup 2023) అక్టోబర్ 5 నుంచి భారత్‌లో ప్రారంభం కానుంది. మొత్తం టోర్నీ భారత్‌లో జరగడం ఇదే తొలిసారి. పొరుగున ఉన్న పాకిస్థాన్‌తో సహా దాదాపు అన్ని జట్లు ఈ 10 జట్ల ప్రపంచ కప్ కోసం భారతదేశానికి చేరుకున్నాయి. కాబట్టి, ఇంత పెద్ద టోర్నీ కోసం భారతదేశంలోని మ్యాచ్‌లు జరిగే నగరాల్లో, మైదానంలో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఈ మధ్య ఓ ముప్పు రావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఖలిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఈ బెదిరింపులు చేశాడు. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ‘వరల్డ్ టెర్రరిస్ట్ కప్’ అని, ప్రపంచ కప్ కాదంటూ ప్రకటించాడు.
గత కొద్ది రోజులుగా ఖలిస్తాన్ విషయంలో భారత్, కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత ప్రభుత్వం తన ఏజెంట్ల ద్వారా చంపిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. కానీ, భారత ప్రభుత్వం ఈ ఆరోపణను తిరస్కరించింది. నిజ్ర్ ఖలిస్తానీ ఉగ్రవాది అని పేర్కొంటూ కెనడాకు తగిన సమాధానం ఇచ్చింది.




గురుపత్వంత్ సింగ్ బెదిరింపులు..
View this post on Instagram
కాగా, కెనడాలో ఏర్పడిన ‘సిఖ్ ఫర్ జస్టిస్’ పేరుతో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారత్‌ను నిత్యం బెదిరిస్తూనే ఉన్నాడు. ప్రపంచకప్ పేరుతో తాజాగా బెదిరింపులు చేస్తున్నాడు. నివేదికల ప్రకారం అక్టోబర్ 5 నుంచి భారతదేశంలో ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్‌లో జరిగే ప్రపంచ కప్‌ను లక్ష్యంగా చేసుకుని పన్నన్ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే, తన సంస్థ వరల్డ్ టెర్రరిస్ట్ కప్‌ను అక్టోబర్ 5 నుంచి ప్రారంభిస్తుందని ఆ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం.
ప్రపంచకప్ తొలి మ్యాచ్ అక్టోబర్ 5న జరగనుంది. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్‌లైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
12 నగరాల్లో పోటీ, గట్టి భద్రత..
ఈ వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని టీమ్‌లు భారత్‌కు చేరుకున్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 29 నుంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. దీంతో దాదాపు 50-55 రోజుల పాటు అన్ని జట్లు భారత్‌లో ఉంటాయి. వార్మప్ మ్యాచ్‌లు, ప్రధాన మ్యాచ్‌ల కోసం దేశవ్యాప్తంగా 12 వేదికలను కేటాయించారు. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




