AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: SRHలో లేఆఫ్‌లు షురూ.. ఆరుగురి మెడలపై కత్తి పెట్టిన కావ్య మారన్.. కారణం ఏంటంటే?

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ తమ మూడవ ఐపీఎల్ ఫైనల్‌ను ఆడింది. కానీ, రెండవసారి టైటిల్‌ను గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. అయితే, ఇప్పుడు 17వ సీజన్ ముగిసింది. దీంతో తదుపరి సీజన్‌కు సిద్ధమయ్యే ముందు, చాలా మంది ఆటగాళ్లు SRHకి దూరంగా ఉండవచ్చు. కావ్య మారన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2025: SRHలో లేఆఫ్‌లు షురూ.. ఆరుగురి మెడలపై కత్తి పెట్టిన కావ్య మారన్.. కారణం ఏంటంటే?
Kavya Maran Srh Team Ipl 20
Venkata Chari
|

Updated on: May 28, 2024 | 1:07 PM

Share

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో తొలగింపులకు శ్రీకారం చుట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీమ్ ఓనర్ కావ్య మారన్ తన ప్లేయర్లలో చాలా మందిని వదులుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. IPL 2024 ఇప్పుడు ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు వచ్చే ఐపీఎల్‌కి ముందు మెగా వేలం జరగనుంది. ఇందులో SRH మాత్రమే కాకుండా అన్ని జట్లు తమ ఆటగాళ్లను చాలా మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే, రిటైన్ చేయబడే ఆటగాళ్ల సంఖ్య పరిమితంగా ఉంది.

ఐపీఎల్ 2024లో ఏం జరగాలో అదే జరిగిపోయింది. గత 3-4 సీజన్‌లతో పోలిస్తే ఈ సీజన్‌లో SRH మెరుగైన ప్రదర్శన చేసింది. ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచింది. టైటిల్ నిరాశపరిచినప్పటికీ, కావ్య మారన్ కూడా తన జట్టు ఫైనల్ ఆడినందుకు గర్వపడుతుంది. కానీ, అదే సమయంలో IPL 2025 కోసం వ్యూహాలను రూపొందించడం కూడా ప్రారంభిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందు కోసం హైదరాబాద్ జట్టు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం, విడుదల చేయడంతో ప్రారంభమవుతుంది.

ఐపీఎల్ ఫైనల్‌లో ఓటమి కారణం కాదు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఆటగాళ్లు బయటికి వస్తే, అది IPL 2024 ఫైనల్‌లో ఓటమికి సైడ్‌ ఎఫెక్ట్‌గా చూడడంలేదు. కానీ IPL 2025 మెగా వేలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా ఉంది. IPL 2025 మెగా వేలం కోసం SRH ఏ ఆటగాళ్లను విడుదల చేయవచ్చనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇటువంటి ఆటగాళ్లలో మొదటి పేరు అబ్దుల్ సమద్, అతనిపై కావ్య మారన్ చాలా పెట్టుబడి పెట్టింది. కానీ అదే రాబడిని పొందలేదు. వీరితో పాటు మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, ఆకాష్‌దీప్, జయదేవ్ ఉనద్కత్, అన్మోల్‌ప్రీత్ సింగ్ వంటి ఆటగాళ్లను కూడా జట్టు విడుదల చేయవచ్చు.

విదేశీ ఆటగాళ్లలో పాట్ కమిన్స్ ఔట్ కావచ్చు. ఎందుకంటే తదుపరి ఫైనల్‌లో అతను ఆడటంపై అనుమానాలు ఉన్నాయి. ట్రావిస్ హెడ్ విషయంలోనూ అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి కాకుండా, SRH మార్కో జాన్సన్, గ్లెన్ ఫిలిప్స్, ఐడాన్ మార్క్రామ్‌లను కూడా విడుదల చేయగలదు.

ఈ ఆటగాళ్ళు రిటైన్ చేసే ఛాన్స్..

SRH IPL 2025 కోసం రిటైన్ చేయగల ఆటగాళ్లలో, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హెన్రిచ్ క్లాసెన్ పేర్లు ఉండవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..