Team India: దేశవాళీలో వరుస సెంచరీలతో ఊచకోత.. కట్‌చేస్తే.. 8 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ?
Karun Nair May Comeback in Team India: దేశవాళీ క్రికెట్‌లో సెంచరీల మీద సెంచరీ చేసిన తర్వాత ఓ క్రికెటర్ టీమిండియా తలుపు తట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులోనూ ఈ ఆటగాడు ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు అతని అదృష్టం సెలక్టర్లకు అనుకూలంగా ఉంటే ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాకు తిరిగి రావచ్చు అని తెలుస్తోంది.
Karun Nair May Comeback in Team India: దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న పలువురు స్టార్ ప్లేయర్లు త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లోనూ తమదైన ముద్ర వేయనున్నారు. అయితే, ఈ టోర్నమెంట్‌లో వరుసగా నాలుగు సెంచరీలతో సహా మొత్తం 5 సెంచరీలు చేసిన ఆటగాడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ అతనికి టీమిండియాలో అవకాశం లభించలేదు. ఈ ఆటగాడి పేరు కరుణ్ నాయర్. వన్డే, టీ-20 జట్టులో అతను చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, అతనికి అర్హమైన భారత టెస్ట్ జట్టులో అతను ఖచ్చితంగా అవకాశం పొందాలని నమ్ముతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో నిలకడగా రికార్డు బద్దలు కొట్టిన తర్వాత, నాయర్ బీసీసీఐ, టీమిండియా తలుపులు తట్టాడు.
8 ఏళ్ల తర్వాత కరుణ్ టీమిండియాలోకి వస్తాడా?
కరుణ్ నాయర్ టీమిండియా తరపున ఆడాడు. అతను చివరిసారిగా 2017లో టీమిండియా తరపున ఆడాడు. అయితే, ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో, జట్టుకు కరుణ్ నాయర్ లాంటి బ్యాట్స్‌మెన్ అవసరం. ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై టీమిండియా ప్రదర్శన చాలా అవమానకరంగా ఉంది. జట్టు బ్యాటింగ్‌లో డెప్త్ ఉన్నప్పటికీ.. బ్యాట్స్‌మెన్ ఫ్లాప్ అయ్యారు. రోహిత్, విరాట్ లాంటి పెద్ద దిగ్గజాలు కూడా పరుగులు చేయలేదు. ఇలాంటి తరుణంలో దేశవాళీ క్రికెట్‌లో సెంచరీల మీద సెంచరీ చేస్తున్న కరుణ్ టీమ్ ఇండియాకు ఊరట కలిగించవచ్చు. అయితే, అతని అదృష్టానికి సెలక్టర్ల మద్దతు కావాల్సి ఉంటుంది. నాయర్ టీమిండియాకు తిరిగి రావాలని తహతహలాడుతున్నాడు. డిసెంబర్ 2022లో, అతను సోషల్ మీడియాలో ‘డియర్ క్రికెట్, నాకు మరో అవకాశం ఇవ్వండి’ అంటూ ఒక పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ 5 సెంచరీలు..
Dear cricket, give me one more chance.🤞🏽
— Karun Nair (@karun126) December 10, 2022
విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ దేశవాళీ టోర్నీలో కరుణ్ నిన్న (జనవరి 12) మరో సెంచరీ (122 పరుగులు) సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు వరుసగా 4 సెంచరీలతో కలిపి మొత్తం 5 సెంచరీలు సాధించాడు. అంతకుముందు, అతను జనవరి 3న యూపీపై 112, డిసెంబర్ 31న తమిళనాడుపై 111, డిసెంబర్ 28న చండీగఢ్‌పై 163, డిసెంబర్ 26న ఛత్తీస్‌గఢ్‌పై 44 నాటౌట్, జమ్మూ & కాశ్మీర్‌పై 112 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ..
టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు కూడా చేయలేని ఫీట్ కరుణ్ నాయర్ సాధించాడు. నాయర్ తన కెరీర్‌లో 6 టెస్టులు ఆడాడు. అతను చివరిసారిగా 2017లో టీమిండియా తరపున మైదానంలోకి వచ్చాడు. ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేయడం ద్వారా కరుణ్ వెలుగులోకి వచ్చాడు. 2016లో చెన్నైలో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లపై తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కరుణ్ 381 బంతుల్లో అజేయంగా 303 పరుగులు చేశాడు. ఇందులో 32 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కరుణ్‌కి ఇది మూడో టెస్టు. అయినప్పటికీ, అతని టెస్ట్ కెరీర్ 6 మ్యాచ్‌లకే పరిమితమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..