Kane Williamson: ప్రపంచకప్‌లో పరాభవం.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కేన్ మామ.. సెంట్రల్ కాంట్రాక్టును సైతం..

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు ఘోర పరాభవం చవి చూడడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచ కప్ ఓటమికి బాధ్యత వహిస్తూ విలియమ్సన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగా వన్డే, టీ20 జట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు బోర్డుకు నివేదించాడు కేన్ మామ.

Kane Williamson: ప్రపంచకప్‌లో పరాభవం.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కేన్ మామ.. సెంట్రల్ కాంట్రాక్టును సైతం..
Kane Williamson
Follow us
Basha Shek

|

Updated on: Jun 19, 2024 | 10:31 AM

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు ఘోర పరాభవం చవి చూడడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచ కప్ ఓటమికి బాధ్యత వహిస్తూ విలియమ్సన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగా వన్డే, టీ20 జట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు బోర్డుకు నివేదించాడు కేన్ మామ. ఈ టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు చాలా పేలవ ప్రదర్శన చేసింది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో ఓడిన కివీస్ జట్టు ఆ తర్వాత వెస్టిండీస్‌పై చేతిలోనూ చిత్తుగా ఓడింది. ఈ రెండు పరాజయాలతో టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఈ దారుణ ప్రదర్శన తర్వాత కేన్ విలియమ్సన్ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. ఇది కాకుండా, అతను 2024-25 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా వదులుకున్నాడు.

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ అధికారిక వెబ్‌సైట్‌లో కేన్ విలియమ్సన్ నిర్ణయాన్ని ప్రకటించింది. ‘ కేన్ విలియమ్సన్ నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నామంటూ తెలపింది. విలియమ్సన్ వైట్ బాల్ క్రికెట్‌లో కెప్టెన్‌గా కొనసాగడానికి ఆసక్తి చూపించడం లేదని, అందువల్ల న్యూజిలాండ్ జట్టుకు ప్రత్యామ్నాయ కెప్టెన్‌ను ఎంపిక చేయాలని విలియమ్సన్ బోర్డును అభ్యర్థించినట్లు సమాచారం. అయితే టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా కొనసాగడంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి న్యూజిలాండ్‌కు రాబోయే రోజుల్లో కేన్ విలియమ్సన్ కేవలం ఆటగాడిగానే బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ విజయవంతమైన నాయకుడిగా..

  • టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ జట్టుకు 40 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కేన్ విలియమ్సన్ 22 సార్లు జట్టును గెలిపించాడు. మరో 8 మ్యాచ్‌లను డ్రా చేసుకోగా 10 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది.
  • విలియమ్సన్ సారథ్యంలో 91 వన్డే మ్యాచ్‌లు ఆడగా, న్యూజిలాండ్ జట్టు 46 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 40 మ్యాచ్‌ల్ ఓడిపోగా, 4 మ్యాచ్‌లు ఫలితం లేకుండా పోయాయి.
  • కేన్ విలియమ్సన్ టీ20 క్రికెట్‌లో 75 మ్యాచ్‌లకు న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహించాడు. 39 మ్యాచ్ ల్లో కివీస్ జట్టు విజయం సాధించగా, 34 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. అదేవిధంగా, ఒక మ్యాచ్ టైగా ముగియగా, మరొకటి రద్దు చేయబడింది.
  • అంటే కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు మూడు ఫార్మాట్లలో 50% కంటే ఎక్కువ మ్యాచ్‌లను గెలుచుకుంది. అందుకే విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు ఉంది.

ఐసీసీ ఈవెంట్లలో కేన్ కెప్టెన్సీ ఇలా..

– 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేత – 2019 ODI ప్రపంచ కప్ రన్నరప్ – 2021 T20 ప్రపంచ కప్ రన్నరప్ – 2023 వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనలిస్ట్ – 2016 T20 వరల్డ్ కప్ సెమీ-ఫైనలిస్ట్ – 2022 T20 వరల్డ్ కప్ సెమీ-ఫైనలిస్ట్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..